తిరుగులేని సూర్య.. మళ్లీ నెంబర్.1?

praveen
టి20 ఫార్మాట్లో భారత స్టార్ బ్యాట్స్మెన్ అయినా సూర్య కుమార్ యాదవ్ సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన ఆటతీరుతో అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా నయా బ్యాటింగ్ ను పరిచయం చేశాడు అని చెప్పాలి. టీమ్ ఇండియాలో ఉన్న మిగతా బ్యాట్స్మెన్లందరూ కూడా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతూ సింగిల్స్ తో సరిపెట్టుకుంటున్న సమయంలో.. అటు సూర్య కుమార్ యాదవ్ మాత్రం సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతూ ఉంటాడు.

 ఈ క్రమంలోనే అద్భుతమైన ఆట తీరుతో ఇప్పటికే ప్రపంచ క్రికెట్లో నయా మిస్టర్ 360 ప్లేయర్ గా కూడా సూర్య కుమార్ యాదవ్ అవతరించాడు అన్న విషయం తెలిసిందే. ఇక తన విధ్వంసకరమైన ఆట తీరుతో ఐసీసీ విడుదల చేసే పురుషుల టి20 ర్యాంకింగ్స్ లో కూడా సత్తా చాటాడు అని చెప్పాలి. ఐసీసీ ర్యాంకింగ్స్ లో ఏకంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. కేవలం నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడమె కాదు గత కొన్ని రోజుల నుంచి ఆ స్థానాన్ని పదిలంగానే ఉంచుకుంటూ వస్తున్నాడు అని చెప్పాలి.

 ఇక ఇటీవల కాలంలో ఎప్పటికప్పుడు మూడు ఫార్మాట్లకు సంబంధించిన ర్యాంకింగ్స్ ను ప్రకటిస్తూ ఉంది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఈ క్రమంలోనే ఇటీవల పురుషుల టీ20 ర్యాంకింగ్స్ ని కూడా ఐసిసి విడుదల చేసింది. ఈ జాబితాలో భారత స్టార్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ 906 పాయింట్లతో  మొదటి స్థానాన్ని నిలుపుకున్నాడు. సూర్య మినహా టాప్ టెన్ లో భారత బ్యాట్స్మెన్లు ఎవరు కూడా లేకపోవడం గమనార్హం. కోహ్లీ 15వ ప్లేస్ లో ఉన్నాడు. ఇక బౌలర్లలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ 710 పాయింట్లతో  తొలి స్థానంలో ఉండగా.. ఆల్రౌండర్ల జాబితాలో షకీబూల్ హసన్ మొదటి స్థానంలో హార్దిక్ పాండ్యా రెండవ స్థానంలో ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: