RR vs LSG: బలమైన జట్ల మధ్య పోటీ.. గెలుపు వారిదే?

Purushottham Vinay
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఇప్పుడు మరో ఆసక్తికర మ్యాచ్ కి రంగం సిద్దమైంది. సువాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌ ఇంకా అలాగే లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య ఈ సూపర్ మ్యాచ్ అనేది జరగనుంది.ఇక ఈ సీజన్‌లో ఇప్పటి దాకా రెండు జట్లు చెరో ఐదు మ్యాచులు ఆడాయి. నాలుగు మ్యాచుల్లో విజయం సాధించిన సంజూ శాంసన్ సారథ్యంలోని రాజస్థాన్ టీం పాయింట్ల పట్టికలో ఫస్ట్ ప్లేస్ లో కొనసాగుతుండగా మూడు మ్యాచుల్లో గెలుపొందిన kl రాహుల్ నేతృత్వంలోని లక్నో సెకండ్ ప్లేస్ లో ఉంది. టాప్ -2 టీమ్స్ పోటీపడుతుండడంతో మ్యాచ్ చాలా ఆసక్తికరంగా సాగే అవకాశం ఉంది.ఇక రాజస్థాన్ రాయల్స్ టీం అయితే చాలా బలంగా ఉంది. అందివచ్చిన అవకాశాలను ఆ టీం ఆటగాళ్లు చాలా చక్కగా వినియోగించుకుంటున్నారు. బట్లర్, యశస్వి జైస్వాల్‌, సంజూ శాంసన్ ఇంకా హిట్‌మయర్ లు పుల్ ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు బాగా కలిసి వచ్చే అంశం. వీరితో పాటు యువ ఆటగాళ్లు పడిక్కల్‌, రియాన్ పరాగ్‌లు కూడా బ్యాట్ ఝుళిపిస్తే బ్యాటింగ్‌లో రాజస్థాన్‌కు ఏమాత్రం తిరుగులేదు. బౌలింగ్‌లో సందీప్ శర్మ, బౌల్ట్, అశ్విన్‌ ఇంకా చాహల్‌లు ప్రత్యర్థి పని పడుతున్నారు.


సొంత మైదానంలో మ్యాచ్ జరుగుతుండడం రాజస్థాన్‌ టీంకి కు కాస్త కలిసి వచ్చే అంశం. ఒకవేళ ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగాలని రాజస్థాన్ రాయల్స్ మేనేజ్‌మెంట్ కనుక భావిస్తే ఇక జంపా స్థానంలో హోల్డర్‌ను తీసుకోవచ్చు.ఇక లక్నో జట్టు కూడా చాలా బలంగానే కనిస్తోంది. అయితే.. ఎవరో ఒకరు ఇద్దరు రాణించడంతో మూడు మ్యాచుల్లో గెలిచింది గానీ సమిష్టిగా ఆడడంలో మాత్రం ఆ టీం వారు విఫలం అవుతున్నారు. కైల్ మేయర్స్ ప్లేస్ లో క్వింటన్ డికాక్‌ను లక్నో తుది జట్టులో తీసుకునే ఛాన్స్ ఉంది. కృనాల్ పాండ్య, నికోలస్ పూరన్‌, మార్కస్ స్టోయినస్‌ ఇంకా కేఎల్ రాహుల్ లు రాజస్థాన్ బౌలింగ్ దాడిని తట్టుకుని ఎంత మేరకు ఆడతారో చూడాలి. ముఖ్యంగా లక్నో టీంని ఆల్‌రౌండర్ దీపక్ హుడా ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. అతడు చాలా దారుణంగా విఫలం అవుతుండడం లక్నో విజయావకాశాలను బాగా దెబ్బతీస్తోంది. మార్క్‌వుడ్‌, ఆవేశ్ ఖాన్‌, కృష్ణప్ప గౌతమ్‌ ఇంకా అలాగే బిష్ణోయ్ లతో కూడిన బౌలింగ్ లైనప్ భీకర ఫామ్‌లో ఉన్న రాజస్థాన్ బ్యాటర్లను ఎంతమేరకు అడ్డుకుంటుందన్న దానిపైనే లక్నో టీం విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: