అర్జున్ కష్టానికి.. ఇన్నాళ్లకు ప్రతిఫలం దక్కుతుంది : సెహ్వాగ్

praveen
గత కొన్ని రోజుల నుంచి సచిన్ టెండూల్కర్ అభిమానులు అందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు అన్న విషయం తెలిసిందే. దీనికి అంతటికీ కారణం అటు సచిన్ టెండూల్కర్ వారసుడు అర్జున్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ తుది జట్టులోకి రావడమే. అంతేకాదు తన ప్రదర్శనతో ఇక అభిమానులను సంతృప్తి పరుస్తూ ఉన్నాడు అర్జున్ టెండూల్కర్. వాస్తవానికి కొన్నేళ్ళ కిందటే ముంబై ఇండియన్స్ జట్టులోకి వచ్చాడు.

 జట్టులో అయితే ఉన్నాడు కానీ అతనికి తుది జట్టులో మాత్రం ఛాన్స్ దక్కలేదు. దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. సచిన్ మీద ఉన్న గౌరవంతోనే అర్జున్ టెండూల్కర్ ను ముంబై ఇండియన్స్ జట్టులోకి తీసుకుందని.. కానీ అతని వాడుకోవాలని ధైర్యం చేయడం లేదు అంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరఫున తుది జట్టులో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు అర్జున్ టెండూల్కర్. అంతేకాదు డెత్ ఓవర్లలో కూడా బౌలింగ్ చేస్తూ అదరగొడుతున్నాడు అని చెప్పాలి.

 ఇటీవల హైదరాబాద్ వేదికగా అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఇక కట్టుదిట్టమైన బౌలింగ్ వేసి ముంబై విజయంలో అర్జున్ టెండూల్కర్ కీలక పాత్ర పోషించాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతని బౌలింగ్ ప్రదర్శన గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించిన వీరేంద్ర సెహ్వాగ్.. అర్జున్ రాణిస్తూ ఉండడం చూస్తే సంతోషంగా ఉంది. తండ్రిగా సచిన్ గర్వపడి ఉంటారు. అర్జున్ కష్టానికి ఇన్నాళ్లకు ప్రతిఫలం లభిస్తుంది. భవిష్యత్తులో అందుకునే గొప్ప ఘనతలకు ఇది నాంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియా వేదికగా అర్జున్ ప్రదర్శనలపై ప్రశంసలు కురిపించారు అని చెప్పాలి. ఇక ఇన్నాళ్ల తర్వాత దొరికిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకున్న అర్జున్ ప్రదర్శన పై ఫాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: