ముంబై తో మ్యాచ్.. కాస్లీ ప్లేయర్ ను పక్కన పెట్టనున్న సన్రైజర్స్?

praveen
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో వరుస ఓటములతో నిరాశపరిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుసగా రెండు ఓటముల తర్వాత మాత్రం అనూహ్యంగా పుంజుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరుసగా విజయాలు సాధిస్తూ దూసుకుపోతోంది. కాగా ఇప్పటికే వరుసగా రెండు విజయాలు సాధించిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇక నేడు హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలతో ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే నేడు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తో హైదరాబాద్ జట్టు మ్యాచ్లో తలబడబోతుంది. అయితే ఈ మ్యాచ్ హైదరాబాద్ జట్టు హోమ్ గ్రౌండ్ అయినా ఉప్పల్ స్టేడియంలో జరుగుతూ ఉండడం ఆ జట్టుకు కలిసి వచ్చే అంశం అని చెప్పాలి.

 అదే సమయంలో ఇక సన్రైజర్స్ హైదరాబాద్ లాగానే వరుసగా రెండు పరాజ్యాల తర్వాత అనౌస్యంగా పుంజుకుని రెండు విజయాలు సాధించింది ముంబై ఇండియన్స్. ఈ క్రమంలోనే ఇక మూడో మ్యాచ్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తుంది. దీంతో ఇక ఇరు జట్ల మధ్య పోరు ఎంతో రసవత్తరంగా మారబోతుంది అన్నది మాత్రం అర్థం అవుతుంది అని చెప్పాలి. అయితే ఈ కీలకమైన పోరుకు ఇక తుడి జట్టులో ఏమైనా మార్పులు చేర్పులు ఉంటాయన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. 13.25 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేసిన హ్యారి బ్రూక్స్ వరుసగా మూడు మ్యాచ్ లలో విఫలమైనప్పటికీ మొన్నటి మ్యాచ్లో మాత్రం సెంచరీ చేసి అదరగొట్టాడు.

 ఇక మరో కాస్ట్లీ ఆటగాడుగా ఉన్న మయాంక్ అగర్వాల్ మాత్రం ఇంకా మునుపటి ఫామ్ అందుకోలేకపోయాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ముంబై ఇండియన్స్ తో ఉప్పల్ వేదికగా జరిగే మ్యాచ్ లో మయాంక్ అగర్వాల్ ని పక్కన పెట్టే ఛాన్స్ ఉంది అని తెలుస్తుంది. 8.25 కోట్ల ధర పెట్టి అతని కొనుగోలు చేయగా నాలుగు మ్యాచ్లలోనూ విఫలం అయ్యాడు. ఇక అతని స్థానంలో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను జట్టు లోకి తీసుకోవాలని అనుకుంటున్నారట. ఇదే జరిగితే అటు ఓపెనింగ్ జోడీగా హ్యారి బ్రూక్  కి తోడుగా అభిషేక్ శర్మ వస్తాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: