ముంబై vs సన్రైజర్స్.. ఇది కవలల పోరు?

praveen
ఐపీఎల్ మొదలైంది అంటే చాలు క్రికెట్ ప్రేక్షకులందరికీ  పండగే. ఎందుకంటే కావాల్సిన ఎంటర్టైన్మెంట్ కోసం ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ లో భాగంగా జరిగే ప్రతి మ్యాచ్ లో కూడా అసలు సిసలైన ఎంటర్టైర్మెంట్ ప్రేక్షకులకు అందుతూ ఉంటుంది అని చెప్పాలి. అంతే కాదు అప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో సహచరులుగా ఉన్న ఆటగాళ్లందరూ ప్రత్యేకంగా మారిపోతారు.. ప్రత్యర్ధులు సహచరులుగా మారిపోయి ఒక జట్టు కోసం పోరాటం చేస్తూ ఉంటారు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే నిజ జీవితంలో అన్నదమ్ములుగా కొనసాగుతూ అంతర్జాతీయ క్రికెట్లో ఒకే జట్టుకు ఆడినవారు.. అటు ఐపిఎల్ లో మాత్రం ప్రత్యర్థులుగా  మారిపోయి హోరాహోరీగా పోటీ పడటం ఎన్నోసార్లు చూశాము. అయితే నేడు ముంబై ఇండియన్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరగబోయే మ్యాచ్లో కూడా ఇలాగే అన్నదమ్ములు ఇద్దరు మరోసారి ఐపీఎల్ లో పోటీ పడబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఉప్పల్ వేదికగా నేడు మ్యాచ్ జరగబోతుంది అనే విషయం తెలిసిందే. సాయంత్రం ఏడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది.

 ఇలా ముంబై ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ కి మరో ప్రత్యేకత ఉంది. దక్షిణాఫ్రికాకు చెందిన మార్కో జాన్సన్ సన్రైజర్స్ తరఫున ఆడుతూ ఉండగా.. డివాన్ జాన్సన్ ముంబై జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇలా ప్రత్యేకంగా ఐపీఎల్ లో పోటీపడిన  కవల సోదరులుగా ఇద్దరు కూడా రికార్డు సృష్టించే ఛాన్స్ ఉంది అని చెప్పాలి. ఇక ఐపీఎల్ లో ఆడిక తొలి కవలలుగా కూడా ఇప్పటికే వీరు రికార్డ్ సృష్టించారు. ఇద్దరు కూడా ఎడమ చేతి వాటం పేసర్లు కావడం విశేషం. దాదాపు ఒకేలా కనిపించే వీరిద్దరిలో మార్కో ఇప్పటికే దక్షిణాఫ్రికా తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. డివాన్ జాన్సన్ ఇంకా దేశవాళి స్థాయిలో ఉన్నాడు. ఇక ఇప్పుడు ఈ కవలలు ప్రత్యర్ధులుగా మారి పోటీపడి ఎవరు పై చేయి సాధిస్తారో చూడాలి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: