ధోని లాంటోడు.. ఇంకొకడు రావడం కష్టమే : గవాస్కర్

praveen
భారత క్రికెట్ లో ఉన్న అత్యుత్తమ కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని మొదటి వరుసలో ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఒక సాదాసీదా క్రికెటర్ గా భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చి తక్కువ సమయంలోనే తనలో అసమాన్యమైన నాయకత్వ ప్రతిభ దాగి ఉంది అన్న విషయాన్ని భారత సెలెక్టర్లకు అర్థమయ్యేలా చేశాడు. ఇక భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎంతో సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపించాడు అని చెప్పాలి. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే మహేంద్ర సింగ్ ధోని ఇక మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం తనకు అనుకూలంగా మార్చుకోగల సమర్థుడు అనడంలో అతిశయోక్తి లేదు.

 అంత సమర్ధుడు కాబట్టే ఇప్పుడు వరకు భారత క్రికెట్ లో ఎవరికి సాధ్యం కాని రీతిలో ఏకంగా టీమ్ ఇండియాకు మూడుసార్లు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఘనతను సొంతం చేసుకున్నాడు. అటు ఐపీఎల్ లో సైతం చెన్నై సూపర్ కింగ్స్ ను నాలుగు సార్లు ఛాంపియన్గా నిలపాడు మహేంద్ర సింగ్ ధోని. ఇక ఇప్పటికీ కూడా తన కెప్టెన్సీ తో ఎప్పుడు మ్యాజిక్ చేస్తూ అభిమానులందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు అని చెప్పాలి. కాగా ధోని కెప్టెన్సీ గురించి స్పందించిన ఎంతోమంది మాజీ ఆటగాళ్లు అతని లాంటి సారధిని ఫ్యూచర్లో భారత క్రికెట్ లో చూడటం అసాధ్యమే అంటూ వ్యాఖ్యానించిన సందర్భాలు కూడా ఉన్నాయి.

 కాగా భారత మాజీ ఆటగాడు సునీల్ గావాస్కర్ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. మహేంద్ర సింగ్ ధోని పై ప్రశంసల వర్షం కురిపించాడు అని చెప్పాలి. ధోని లాంటి కెప్టెన్ మళ్ళీ భవిష్యత్తులో రావడం కష్టమే. అతడు ఒక విభిన్నమైన కెప్టెన్. 200 మ్యాచ్లకు కెప్టెన్ గా ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. చాలా కష్టం. ఎక్కువ మ్యాచులకు కెప్టెన్ గా ఉండడం వ్యక్తిగత ప్రదర్శన పై కూడా ప్రభావం చూపుతూ ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలో చెన్నై జట్టు ధోని కెప్టెన్సీ నుంచి నేర్చుకుంది అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: