వరుస ఓటములు.. కోచ్ రికీ పాంటింగ్ ఏం చేశాడంటే?

praveen
2023 ఐపీఎల్ సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్ కి ఒక పీడకల  లాంటి సీజన్ గా మారిపోతుందా అంటే ప్రస్తుతం పరిస్థితులు చూస్తూ ఉంటే అందరూ అవును అనే సమాధానం చెబుతున్నారు. ఎందుకంటే అటు ఐపీఎల్ హిస్టరీలో పటిష్టమైన టీం గా పేరు ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి ఎన్నడు లేనంత పేలవమైన ప్రదర్శన చేస్తూ ఉంది. వరుసగా ఐదు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఈ ఐపిఎల్ సీజన్ లో ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా సాధించలేకపోయింది ఢిల్లీ క్యాపిటల్స్. అనుభవజ్ఞుడైన   వార్నర్ సారధిగా ఉన్నప్పటికీ కూడా ఇక ప్రతి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విఫలం అవుతూనే ఉంది.

 ఇటీవల ఆర్సిబి తో మ్యాచ్లో ఓడిన ఢిల్లీ వరుసగా ఐదో ఓటమిని నమోదు చేసింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే జట్టు కెప్టెన్  వార్నర్ తో పాటు ఇక మెంటర్ సౌరబ్ గంగూలీ కోచ్ రికీ పాంటింగ్ లను కూడా టార్గెట్ చేస్తూ ఎంతో మంది అభిమానులు విమర్శలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా వీరిని ఉద్దేశించి విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం. అయితే వరుస ఓటముల నేపథ్యంలో ఇక జట్టుకు హెడ్ కోచ్గా ఉన్న రికీ పాంటింగ్ ఆటగాళ్లకు క్లాస్ తీసుకున్నాడట. ఆర్ సి బి తో మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత కుల్దీప్  పాంటింగ్ కి సారీ చెప్పాడట.

 అయితే తనకు కావాల్సింది సారి కాదని ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేసి మ్యాచులు గెలవడం కావాలి అంటూ రికీ పాంటింగ్ సీరియస్ అయ్యాడట. కుల్దీప్ నువ్వు ఎక్కడ? ఓడిపోయినందుకు బాధగా ఉందా.. మ్యాచ్ అయిపోయాక నువ్వు నా దగ్గరికి వచ్చి సారీ చెప్పావు. కానీ కుల్దీప్ నీకు ఒక విషయం చెబుతున్నాను. నాకే కాదు క్రికెట్ ఫీల్డ్ లో జరిగే దానికిగాను ఎవరికి ఎప్పుడు సారీ చెప్పకు.. నాకు కావాల్సింది మీ సారీలు కాదు.. మీరు మళ్ళీ పుంజుకోవాలి.. మ్యాచులు గెలవాలి.. వాస్తవానికి బెంగళూరు తో మ్యాచ్ లో నువ్వు రెండు వికెట్లు తీసావ్. మంచి ప్రదర్శన అది. కానీ ఇంకా బాగా ఆడాలి అంటూ క్లాస్ పీకాడట రికీ పాంటింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: