ఐపీఎల్ హిస్టరీలో.. అరుదైన రికార్డు సాధించిన హార్దిక్?

praveen
హార్దిక్ పాండ్యా భారత క్రికెట్లో స్టార్ ఆల్ రౌండర్ గా కొనసాగుతూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ లో కూడా ఎన్నో ఏళ్ల పాటు ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి  అద్భుతమైన ఆటతీరుతో ఎప్పుడు అభిమానులను ఆకట్టుకునేవాడు. అయితే ముంబై ఇండియన్స్ అతన్ని మెగా వేలంలోకి వదిలేసిన తర్వాత మాత్రం గుజరాత్ జట్టులోకి వెళ్ళాడు. గుజరాత్ జట్టులో ఒక ఆటగాడిగా వెళ్లడమే కాదు కెప్టెన్సీ బాధ్యతలను  కూడా అందుకున్నాడు అని చెప్పాలి.

 కాగా ఎన్నో ఏళ్ల నుంచి ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న హార్దిక్ పాండ్యా ఇక గుజరాత్ కెప్టెన్ గా మారిన తర్వాత మరింత బాధ్యతగా ఆడుతూ రికార్డులు కొల్లగొడుతున్నాడు అని చెప్పాలి. ఒకవైపు కెప్టెన్గా  సక్సెస్ అవుతూనే మరోవైపు తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు హార్దిక్ పాండ్యా. ఇక ఇప్పుడు అటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో సక్సెస్ఫుల్ కెప్టెన్లలో ఒకటిగా మారిపోయాడు అని చెప్పాలి. అలాంటి హార్దిక్ పాండ్యా ఇటీవల తన ఆల్ రౌండ్  ప్రదర్శనతో ఒక అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి.

 ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో రెండువేల రన్స్ పూర్తి చేయడంతో పాటు 50 వికెట్లు తీసిన ఆల్రౌండర్ల జాబితాలో చేరిపోయాడు గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా.. 29 ఏళ్ల 187 రోజుల్లోనే ఈ ఘనత అందుకున్నాడు హార్థిక్ పాండ్యా. అంతేకాదు ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా అరుదైన రికార్డు సృష్టించాడు. ఇక హార్దిక్ పాండ్యా కంటే ముందు వాట్సన్, పోలార్డ్, జడేజా, కలీస్, రసెల్ ఇక ఈ రికార్డును అందుకున్నారు అని చెప్పాలి. కానీ వాళ్లంతా కూడా హార్దిక్  కంటే పెద్దవయసులో ఈ రికార్డ్ సాధించారు. ఇకపోతే ఈ ఏడాది ప్రతి మ్యాచ్లో కూడా మంచి ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నాడు హార్దిక్ పాండ్యా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: