ఆ విషయంలో తగ్గేదేలే.. క్లారిటీ ఇచ్చిన బిసిసిఐ?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఎన్నో దేశాల్లో క్రికెట్ బోర్డులు ఉన్నప్పటికీ ఇక ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న క్రికెట్ బోర్డుగా కొనసాగుతుంది మాత్రం అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి అని చెప్పాలి. అంతేకాదు ఇక ప్రపంచ క్రికెట్లో రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా కూడా బీసీసీఐ కొనసాగుతూ ఉంది. కేవలం పేరుకు మాత్రమే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఉన్నప్పటికీ ఇక ఐసీసీ తీసుకునే ప్రతి నిర్ణయం వెనక అటు బీసీసీఐ ఉంటుంది అన్నది ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు తెలిసిన నిజం. అయితే బిసిసిఐ ప్రతి ఏడాది ఐపీఎల్ నిర్వహిస్తూ ఉంటుంది.

 ప్రపంచవ్యాప్తంగా వివిధ జట్లలో ఉన్న టాలెంటెడ్ ప్లేయర్స్ అందరూ కూడా ఐపీఎల్లో కనిపిస్తూ ఉంటారు. కేవలం ఐపిఎల్ లోనే కాదు ఇక మిగతా దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహించే దేశీయ లీగల్ లో సైతం ఇలా విదేశీ ఆటగాళ్లు ఆడుతూ ఉంటారు. కానీ ఒక్క భారత ఆటగాళ్లు మాత్రం ఐపీఎల్ మినహా ఏ విదేశీ లీగ్లలో ఇప్పటివరకు ఆడలేదు అని చెప్పాలి. ఇలా విదేశీ లీగ్లలో ఆడేందుకు బీసీసీఐ భారత ప్లేయర్లకు అనుమతి ఇవ్వలేదు. ఈ విషయంపై బీసీసీఐ కొన్నిసార్లు విమర్శలు కూడా ఎదుర్కొంది.

 ఇక ఇదే విషయంపై స్పందించిన బీసీసీఐ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది అని చెప్పాలి. భారత క్రికెటర్లను విదేశీ లీగుల్లో ఆడేందుకు అనుమతించే ప్రసక్తే లేదు అంటూ స్పష్టం చేసింది. ఇండియా ప్లేయర్లు ఆడకపోయిన విదేశీ లీగ్ లలో భాగస్వామ్యం కావాలనుకుంటే ఫ్రాంచైజీలను అడ్డుకోబోము అంటూ తెలిపింది. ఇకపోతే ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు సౌత్ ఆఫ్రికా, దుబాయ్ లీగ్ లలో సైతం జట్లను సొంతం చేసుకున్నాయి అన్న విషయాన్ని కూడా గుర్తు చేసింది బీసీసీఐ. అయితే ఐపీఎల్ లాంటి లీగ్ను ఏర్పాటు చేయాలని ఫ్రాంచైజీ  ఓనర్లకు సౌదీ అరేబియా ఆఫర్ ఇచ్చిన నేపథ్యంలో బీసీసీఐ ఇలా స్పందించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: