థర్డ్ టైం లక్కీ అంటూ.. ప్రేయసిని పెళ్ళిడిన ఆసీస్ మహిళా క్రికెటర్?

praveen
జెస్సికా లూసీ జోనాసేన్...  ఆస్ట్రేలియా అల్ రౌండర్ గా ఉన్న ఈమె తాను చాలా రోజులుగా పేమిస్తున్న తన ప్రేయసి సారా వెర్న్ తో పెళ్లి బంధం తో ఒక్కటయ్యింది. ఈ నెల ఆరవ తేదీన పెళ్లి చేసుకున్న ఈ జంట దాదాపుగా పదేళ్లుగా ప్రేమ లో మునిగి తేలుతున్నారు. జోనాసేన్ సారా తమ పెళ్లిని అత్యంత సన్నిహితుల నడుమ హవాయి లో జరుపుకున్నారు.

 జోనాసేన్ తమ పెళ్ళికి సంబందించిన ఫోటోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేయడం తో ఈ విషయం బయట ప్రపంచానికి తెలిసింది. అందరికి సర్ప్రైజ్ అని థర్డ్ టైం లక్కీ అంటూ తన ప్రాణ స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నట్టు తెలిపింది. ఏప్రిల్ 6 కి తన జీవితంలో అత్యంత ప్రాధాన్యత ఉంటుంది అని పోస్ట్ చేసింది జోనాసేన్.

ఇక జోనాసేన్ చాల దైర్యంగా తానొక లెస్బియన్ అంటూ ప్రపంచానికి చాటింది. ఆరేళ్ళ క్రితమే తాను ఈ విషయాన్నీ అందరికి చెప్పి షాక్ ఇచ్చింది. ఇక ఆస్ట్రేలియా లో ఇలాంటి వివాహాలకు చట్ట బద్దత కూడా ఉంది. అయితే ఆసీస్ లో ఇవన్నీ సర్వసాధారణ విషయాలే. పైగా ఆసీస్ క్రికెటర్స్ ఇప్పటికే చాల మంది తాము లెస్బియన్స్ అంటూ చెప్పి తమ స్నేహితురాళ్లను పెళ్లాడారు. ఇక జోనాసేన్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీమ్ కి ఆడుతూ అల్ రౌండర్ గా ఎదిగిన ఆమె ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలుచుకున్న టీమ్ మెంబర్ గా ఉంది. అంతే కాకుండా ఐదు t20 ప్రపంచ కప్స్ గెలిచినా జట్టులో కూడా కీలక మెంబర్. ఒక వన్ డే వరల్డ్ కప్ కూడా ఆమె ఖాతాలో ఉండటం విశేషం. ఇక జోనాసేన్ ఢిల్లీ తరపున విమెన్ ప్రీమియర్ లీగ్ లో కూడా పాల్గొంది. తొమ్మిది మ్యాచులు ఆది తొమ్మిది వికెట్స్ తీసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: