హార్థిక్ పాండ్య కు.. గట్టి షాక్ ఇచ్చిన ఐపీఎల్ నిర్వాహకులు?

praveen


గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్య కు ఐపీల్ నిర్వాహకులు పెద్ద షాక్ ఇచ్చారు. గత రాత్రి పంజాబ్ కింగ్స్ తో గుజరాత్ టైటాన్ కి మ్యాచ్ జరగగా, సమయం అయిపోయిన కూడా వేయాల్సిన ఓవర్లు మిగిలి ఉండటం తో నిర్ణీత సమయం మించి ఆటను కొనసాగించాల్సి వచ్చింది. ఈ స్లో ఓవర్ రేట్ కారణం గా ఐపీల్ నిర్వాహకులు హార్థిక్ పాండ్యకు 12 లక్షల రూపాయల జరిమానా విధించారు.

ఇది గుజరాత్ జట్టు తరపున జరిగిన మొదటి తప్పిదం కావడంతో అతి తక్కువ జరిమానాతో సరిపెట్టునట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఇక ఇలా స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా కట్టిన మూడవ వ్యక్తిగా హార్థిక్ పాండ్య రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు బెంగుళూరు కెప్టెన్ డూప్లెసిస్ మరియు రాజస్థాన్ కెప్టెన్ సంజు సాంషన్ ఈ విధంగా జరిమానా విధింపబడ్డారు. ఇక పంజాబ్ తో గుజరాత్ మ్యాచ్ విషయానికి వస్తే ఈ సీజన్ లో పంజాబ్ పై గెలిచి గుజరాత్ మూడవ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.


ధావన్ సేనను తో మొహాలీ లోని బాంద్రా క్రికెట్ స్టేడియం లో ఆరు వికెట్ల తేడా తో గెలిచింది గుజరాత్ టైటాన్స్. అయితే మొదట బౌలింగ్ కి దిగిన గుజరాత్ జట్టు చాల పొదుపుగా బౌలింగ్ చేసి కేవలం 153 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఇక చివర వరకు గుజరాత్ ఈ స్కోర్ ని సాదించేందుకు కష్టపడాల్సి వచ్చింది. నువ్వా నేనా అన్నట్టుగా జరిగిన ఈ మ్యాచ్ లో వృద్ధిమాన్ సాహా(30), శుబ్ మన్ గిల్(67) రాణించడం తో ఒక బాల్ మిగిలి ఉండగానే గుజరాత్ మంచి విజయాన్ని కైవసం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ ఫేసర్ మోహిత్ శర్మ తన రీఎంట్రీ తో అదరగొట్టాడు. పంజాబ్ కింగ్స్ ని అతి తక్కువ స్కోర్ కి కట్టడి చేయడం లో సఫలం అయ్యాడు. దాంతో గుజరాత్ కి గెలుపు సాధ్యం అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: