చెన్నై జట్టుకి మరో షాక్.. కీలక ప్లేయర్ కి గాయం?

praveen
ఐపీఎల్ హిస్టరీలో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ కు.. అటు 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో మాత్రం వరుసగా షాకులు తగ్గుతున్నాయ్. ఎందుకంటే జట్టు లో ఉన్న కీలక ఆటగాళ్లు గాయం బారిన పడుతూ జట్టుకు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పాలి. ఇప్పటికే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మోకాలి గాయం బారిన పడ్డాడు అన్నది తెలుస్తుంది. డగౌట్ కి నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కనీసం నడవలేని స్థితిలో కనిపించాడు మహేంద్ర సింగ్ ధోని. దీంతో తర్వాత మ్యాచ్ లకి అతను అందుబాటులో ఉంటాడా లేదా అనే ఆందోళన అభిమానుల్లో మొదలయింది.

 అయితే మహేంద్ర సింగ్ ధోని గాయం బారిన పడ్డాడు అని షాక్ నుంచి తేరుకునే లోపే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి మరో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది అనేది తెలుస్తుంది. చెన్నై జట్టులో కీలక ప్లేయర్ గా కొనసాగుతున్న సిసింద మగల చేతి వేలికి కూడా గాయమైనట్లు తెలుస్తుంది. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. నువ్వా నేనా అన్నట్లుగా జరిగిన ఈ పోరులో మూడు పరుగుల తేడాతో చెన్నై జట్టు ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా మ్యాచ్ ఉత్కంఠ గా సాగుతున్న సమయంలో అశ్విన్ ఇచ్చిన క్యాచ్ ని అందుకునే క్రమంలో ఇక చెన్నై జట్టులో కీలక ఫేసర్ గా ఉన్న సిసింద మగల చేతి వేలికి గాయమైంది.

 దీంతో కేవలం రెండు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలిగిన మగల ఇక తన ఓవర్ల కోట ను గాయం కారణంగా కంప్లీట్ చేయలేకపోయాడు అని చెప్పాలి. అయితే ఇటీవలే గాయాన్ని పరిశీలించిన వైద్యులు  అతనికి రెండు వారాలపాటు విశ్రాంతి అవసరం అని సూచించినట్లు తెలుస్తుంది. కాగా ఇప్పటికే అటు స్టార్ బౌలర్ దీపక్ చాహార్ తో పాటు ఆల్రౌండర్ బెన్ స్ట్రోక్స్ కూడా గాయం కారణంగా మరికొన్ని వారాలపాటు జట్టుకు అందుబాటులో ఉండలేరు అన్న విషయం కూడా తెలుస్తుంది. మరి కనీసం ధోని అయిన గాయం నుంచి కోల్పోయిన తర్వాత మ్యాచ్లో అందుబాటులోకి వస్తాడో లేదో చూడాలి మరీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: