గిల్, రాహుల్ మాయలో పడి.. సెలెక్టర్లు మ్యాచ్ విన్నర్ నే మరిచారే?

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియా వరల్డ్ కప్ గెలవడంలో విఫలం అవుతూనే వస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు ఇక ఐసీసీ టోర్నీలలో ఫైనల్ వరకు వెళ్తున్నప్పటికీ కీలకమైన సమయం లో చేతులు ఎత్తేస్తూ ఇక ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. 2014 ప్రపంచ కప్, 2017 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ లో తుదిమెట్టుపై టీమిండియా ఇలాగే బోల్తా పడింది. 2016, 2022 టీ20 ప్రపంచ కప్లలో సైతం ఇదే జరిగింది. ఇక 2017 వన్డే వరల్డ్ కప్ లో సెమీస్లో చేతులెత్తేసింది టీమిండియా.

 దీనికి అంతటికి కారణం టీమిండియాలో మ్యాచ్ విన్నర్లు లేకపోవడమె. జట్టులో కోహ్లీ, రోహిత్ శర్మలు ఉన్నప్పటికీ కీలకమైన సమయంలో వీళ్లు కూడా చేతులెత్తేస్తున్నారు. దీంతో నాకౌట్ పోరులో ఇక రాణించే ప్లేయర్లే కరువయ్యారు. కాగా ఈ ఏడాది వన్డే ప్రపంచ కప్ ఉండడంతో జట్టు కూర్పు పై బిసిసిఐ కసరతులు చేస్తుంది. ఓపనర్ గా గిల్, రోహిత్ శర్మ లేకపోతే కేఎల్ రాహుల్ ని పరిశీలిస్తుంది. అయితే ఇలా బీసీసీఐ సెలెక్టర్లు గిల్, కేఎల్ రాహుల్ మాయలో పడిపోయి ఏకంగా మ్యాచ్ విన్నర్ ని పక్కన పెట్టేస్తున్నారు అన్నది అర్థమవుతుంది.

 అతను ఎవరో కాదు శిఖర్ ధావన్.. ప్రస్తుతం ఐపిఎల్ లో పరుగుల వరద పారిస్తున్నాడు. ఆడిన మూడు మ్యాచ్ లలో కలిపి 225 పరుగులు చేసాడు. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా కూడా ఉన్నాడు. నెమ్మదిగా మొదలెట్టి ఆ తర్వాత రెచ్చిపోయి వీరవిహారం చేయడం ధావన్ స్టైల్. ఇక ఒత్తిడిలో ఆడటం లో శిఖర్ ధావన్ దిట్ట అని చెప్పాలి. ఇక ఇప్పుడు టీమిండియాలో ఒత్తిడిలో బాగా రాణించే ప్లేయర్స్ ఉన్నారా అంటేఎవరు లేరు అని చెప్పాలి.. అందుకే మ్యాచ్ విన్నర్ అయినా శిఖర్ ధావన్ ను జట్టులోకి తీసుకోవాలని భారత క్రికెట్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: