పాపం అర్జున్ టెండూల్కర్... ఆ టీమ్ లోకి వెళ్లిన.. ఎంట్రీ ఇచ్చేవాడు?

praveen
సాధారణంగా ఒక ఆటగాడిని ఏదైనా ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది అంటే చాలు ఏదో ఒక సమయంలో అతనికి తుది జట్టులో అవకాశం కల్పించి ప్రతిభను  నిరూపించుకునేందుకు ఛాన్స్ ఇస్తూ ఉంటుంది. కానీ ముంబై ఇండియన్స్ మాత్రం ఒక ఆటగాడు విషయంలో తీవ్ర వివక్ష చూపుతుంది అన్నది అర్థమవుతుంది. అప్పుడెప్పుడో 2021 మినీ వేలంలో సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ను బేస్ ప్రైస్ 20 లక్షలకు కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్.

 అయితే ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ గా, బ్యాట్స్మెన్ గా, కోచ్గా, బ్యాటింగ్ కన్సల్టెంట్ గా, మెంటర్ గా ఎన్నో రకాలుగా సేవలు అందించిన సచిన్ మీద గౌరవంతో అర్జున్ ని కొనుగోలు చేసినట్లు టోల్స్ వచ్చాయి.  కానీ ఎన్నో ఏళ్లుగా ముంబై జట్టుకు నెట్ బౌలర్ గా ఉన్న అర్జున్ బౌలింగ్ నచ్చడం వల్లే కొనుగోలు చేశామని ముంబై మాజీ బౌలర్ జహీర్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఇలా ముంబై జట్టుకు అయితే సెలెక్ట్ అయ్యాడు. కానీ తుది జట్టులోకి వచ్చే అవకాశం మాత్రం అర్జున్ దక్కించుకోలేకపోతున్నాడు. గత ఏడాది దారుణమైన ప్రదర్శన చేసిన సీజన్లోనూ అర్జున్ ను అవకాశం ఇవ్వలేదు.

 ఇక ఈ సీజన్లోనూ మొదటి మ్యాచ్ లో అర్షద్ ఖాన్, నేహాల్ వదెరాలకు అవకాశం ఇచ్చిన ముంబై ఇండియన్స్.. అర్జున్ టెండూల్కర్ ను ఎప్పటిలాగానే పట్టించుకోలేదు. కావాలనే ముంబై ఇండియన్స్ అటు అర్జున్ టెండూల్కర్ ను ఎదగనివ్వడం లేదంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. ఒకవేళ రాజస్థాన్ లేదా పంజాబ్ జట్లకు సెలెక్ట్ అయి ఉంటే ఇప్పుడు వరకు డజన్కు పైగానే మ్యాచులు ఆడేసేవాడు అని ఎంతో మంది సచిన్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే 2022 మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ అర్జున్ టెండూల్కర్ కోసం 30 లక్షల బిడ్ వేసింది. సచిన్ స్నేహితుడు ఆశిష్ నెహ్ర అర్జున్ ని ప్రోత్సహించేందుకు సిద్ధమయ్యాడు. చివరికి ఆ జట్టులోకి వెళ్లిన అర్జున్కి ఇప్పటికే అవకాశం దక్కేది అని అభిమానులు అనుకుంటున్నారు. అయితే ఎందుకు అర్జున్ టెండూల్కర్ ని ముంబై ఇండియన్స్ పక్కన పెడుతుంది అన్నది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియని చిక్కు ప్రశ్నగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: