రూ.20 లక్షల బేస్ ప్రైస్ తో వచ్చి.. వండర్స్ క్రియేట్ క్రియేట్ చేస్తున్నాడు?

praveen
బిసిసిఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతోమంది యువ ఆటగాళ్లకు తమ సత్తా ఏంటో నిరూపించుకునేందుకు మంచి వేదికగా మారిపోయింది. ఐపీఎల్ లో ప్రతిభను నిరూపించుకుని ఎంతోమంది యువ ప్లేయర్లు తమ తమ దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని దక్కించుకున్నారు అన్న విషయం తెలిసిందే. అటు భారత క్రికెట్లో సైతం ఐపీఎల్ ఫ్యూచర్ స్టార్లను అందిస్తుంది. ఇప్పటికే ఐపీఎల్ ద్వారా మంచి ప్రదర్శన చేసి రుతురాజు గైక్వాడ్, తిలక్ వర్మ, మోసిన్ ఖాన్, కుల్దీప్ సేన్ లాంటి ప్లేయర్లు ఫ్యూచర్ స్టార్స్ అని గుర్తింపు సంపాదించుకున్నారు.

 ఇక ఈ ఏడాది ఐపిఎల్ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మరో యువ ఆటగాడు కూడా ఇలాగే సత్తా చాటుతూ ఉన్నాడు అని చెప్పాలి. చెన్నైకి చెందిన సాయి సుదర్శన్ ను గుజరాత్ టైటాన్స్ వేలంలో కేవలం 20 లక్షలు మాత్రమే పెట్టి బేస్ ప్రైస్ కి కొనుగోలు చేసింది. కానీ అతను ఇప్పుడు ఐపీఎల్ లో వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పాలి. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన పోరులో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగి 22 పరుగులతో గిల్ తో కలిపి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో మరో మెట్టు పైకే ఎక్కి ప్రదర్శన చేశాడు సాయి సుదర్శన్.

 గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్ మొత్తం తక్కువ పరుగులకే వికెట్ కోల్పోయిన నేపథ్యంలో.. ఇక జట్టు ఓటమి ఖాయమని అందరూ ఫిక్స్ అయ్యారు. అలాంటి సమయంలో ఇక వన్ డౌన్ లో బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు సాయి సుదర్శన్. సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. 48 బంతుల్లో 62 పరుగులు చేసి అజెయంగా నిలిచాడు. ఇందులో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉండడం విశేషం. విజయ శంకర్ తో కలిసి ఇన్నింగ్స్ ను నిలబెట్టిన సాయి సుదర్శన్ చివరికి డేవిడ్ మిల్లర్ తో కలిసి మ్యాచ్ కి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. ఇకపోతే ఐపీఎల్లో అతనికి దక్కిన 20 లక్షల ధర కంటే అటు తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో 21.6 లక్షలు సొంతం చేసుకోవడం గమనార్హం .

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: