వావ్ సంజు సాంసన్ ..ఎవరికీ సాధ్యం కానీ ఒక రికార్డు కొట్టేశావ్?

praveen
ఐపీఎల్ 2023 ఘనంగా మొదలైంది. ఈ లీగ్ లో ఆడిన తొలి మ్యాచ్ తోనే అద్భుతమైన ప్రదర్శన చేసింది గత ఏడాది రన్నరప్  గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్. మొదటి మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరగడంతో ఏకంగా రాజస్థాన్ 72 పరుగుల తేడాతో మంచి విజయాన్ని అందుకుంది. ఇక రాజస్థాన్ టీం లో సంజు సాంసన్ అర్ద సెంచరీ కొట్టి జట్టును గెలిపించగా అతడితో పాటు ఆ జట్టులో ఉన్న జాస్ బట్లర్, యశశ్వి జైస్వాల్ సైతం అర్థసంచరీలు నమోదు చేశారు. ఇక ఈ క్రమంలోనే ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు సంజు సాంసన్. సన్ రైజర్స్ తో ఆట అంటేనే విరుచుకు పడే సంజు ఇప్పటికే సన్ రైజర్స్ టీం పై 700 పైచిలుకు పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. అంతేకాదు ఇంత భారీ పరుగులు ఒకే జట్టుపై చేసిన మొదటి ఆటగాడిగా కూడా నిలిచాడు. ఇక ఈ రకమైన రికార్డులో సంజు తర్వాత స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. సన్ రైజర్స్ పై 569 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. ఇప్పటి వరకు ఈ స్థానంలో  కోహ్లీ ముందు వరసలో ఉండగా అతడిని దాటి సంజు సాంసన్ ఈ రికార్డును బ్రేక్ చేశాడు. ఇక సంజు మరియు కోహ్లీ ల తర్వాత షేన్ వాట్సన్ మూడవ స్థానంలో 566 పరుగులతో ఉన్నాడు. 540 పరుగులతో ఏ బి డివిలియర్స్ కూడా ఈ వరుసలో 4వ స్థానంలో ఉన్నాడు. అంబటి రాయుడు 540 పరుగులు సాధించి 5వ స్థానాన్ని దక్కించుకున్నాడు. అంతేకాదు రాజస్థాన్ రాయల్స్ ఆడిన మొదటి మ్యాచ్ లో అర్థ సెంచరీలు బాధడం సంజుకి ఇదేం కొత్త కాదు. వరుసగా నాలుగు సార్లు అర్థ సెంచరీలు బాదాడు. మొదట 2020వ సంవత్సరంలో 74 పరుగులు చేయగా 2021 వ సంవత్సరంలో 119 పరుగులు చేశాడు. 2022వ సంవత్సరంలో 55, 2023లో మరోసారి 55 పరుగులు చేశాడు. ఇక ఈసారి రాజస్థాన్ రాయల్స్ జట్టు చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మంచి ఆదిపత్యాన్ని కనబరుస్తోంది. బ్యాటింగ్ విభాగంలో బట్లర్, జైస్వాల్, సామ్సన్ లు స్ట్రాంగ్ గా ఉండగా,  అశ్విన్, చాహల్ వంటి వారు బౌలింగ్ విభాగంలో స్ట్రాంగ్ గా ఉండటం రాజస్థాన్ కి కలిసి వచ్చే అంశాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: