ఈసారి వరల్డ్ కప్ గెలవకపోతే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయి : గవాస్కర్

praveen
2011వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇప్పటివరకు కూడా టీమిండియాకు అటు వరల్డ్ కప్ అనేది కేవలం అందరిని ద్రాక్ష లాగే మారిపోయింది అని చెప్పాలి. జట్టుకు ఎంతోమంది కెప్టెన్లు మారినా కూడా అటు వరల్డ్ కప్ కళ మాత్రం నెరవేరడం లేదు. ప్రపంచ క్రికెట్లో భారత జట్టు ఒక పటిష్టమైన టీం గా కొనసాగుతూ ఉన్నప్పటికీ వరల్డ్ కప్ లో మాత్రం ఎందుకో ఒత్తిడిని తట్టుకోలేక చివరికి ప్రత్యర్ధుల చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. కొన్ని కొన్ని సార్లు ఇక ఫైనల్ వరకు వెళ్లిన కేవలం రన్నరప్ తో మాత్రమే సరిపెట్టుకుంటుంది అన్న విషయం తెలిసిందే.

 ఇక గత ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో కూడా ఇక ఇలాగే టీమ్ ఇండియా పేలవ ప్రదర్శనతో సెమి ఫైనల్లో ఓడిపోయి ఇంటిదారి పట్టింది. అయితే ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ వన్డే వరల్డ్ కప్ లో అటు టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది. స్వదేశీ పరిస్థితిలను వినియోగించుకొని వరల్డ్ కప్ గెలుస్తుందని ప్రతి ఒక్కరు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇక ఇదే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు సైతం తమ రివ్యూ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 ఇక ఇదే విషయంపై స్పందించిన టీమ్ ఇండియా మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఒకవేళ వన్డే వరల్డ్ కప్ గెలవకపోతే మాత్రం కొంతమంది ఆటగాళ్ల కెరియర్ ముగిసే అవకాశం ఉంది అంటూ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించాడు. వరల్డ్ కప్ వరకు ఏ ఆటగాడైనా సరే ఒక్క మ్యాచ్ మిస్ అయినా కూడా అది వారి సంసిద్ధతను దెబ్బతీస్తుంది అంటూ అభిప్రాయపడ్డాడు.  అయితే ఈసారి మాత్రం వరల్డ్ కప్ గెలవకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అంటూ హెచ్చరించాడు. ముఖ్యంగా జట్టుకు ఆడకుండా రెస్ట్ తీసుకునే వారి కెరియర్ ముగుస్తుంది అంటూ వ్యాఖ్యానించాడు..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: