సురేష్ రైనా అత్తమామల హత్య.. నిందితుడి ఎన్కౌంటర్?

praveen
ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా మారిన తర్వాత ఇక నేరస్తుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. నేర చరిత్ర కలిగిన రాష్ట్రంగా ఉన్న ఉత్తరప్రదేశ్ ను నేరరహిత రాష్ట్రంగా మార్చేందుకు ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు యోగి ఆదిత్యనాథ్. ఈ క్రమంలోనే ఇక నేరస్తులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఎంతో మంది నేరస్తులను ఎన్కౌంటర్ చేయడం కూడా చూస్తూనే ఉన్నాం.

 ఇక క్రమక్రమంగా అటు యూపీలో క్రైమ్ రేట్ తగ్గుతూ వస్తుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే ఎంతోమంది నేరస్తులను వెంటాడి వేటాడి మరి ఇక ఎన్కౌంటర్ చేసిన యూపీ పోలీసులు ఇక ఇటీవలే ఒక హత్య కేసులో నితితుడిగా ఉన్న వ్యక్తిని సైతం ఎన్కౌంటర్ చేసి చంపేశారు.  మాజీ క్రికెటర్ సురేష్ రైనా అత్తమామలు దారుణ హత్యకు గురయ్యారు అన్న విషయం తెలిసిందే. ఇలా అత్తమములు చనిపోయిన సమయంలోనే అటు సురేష్ రైనా ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నుంచి తప్పుకొని ఇంటికి వెళ్ళాడు.

 2020 సంవత్సరం  లో సురేష్ రైనా అత్త మామల ఇంట్లో చోరీకి పాల్పడ్డాడు నిందితుడు రషీద్. అయితే ఇక అతన్ని గమనించిన రైనా అత్తమామలు అడ్డుకోబోయారు. ఈ క్రమం లోనే వారిద్దరితోపాటు అతని బావమరిదిని కూడా తీవ్రంగా గాయపరిచాడు నిందితుడు. ఇక ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన సురేష్ రైనా అత్తమామలు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనను ఎంతో సీరియస్గా తీసుకొని పోలీసులు నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతనిపై 50 వేల రూపాయల రివార్డు కూడా ప్రకటించారు. కాగా ఇటీవలే అతని ఆచూకీ తెలియడంతో ముజ్ఫర్ నగర్ లో హత్య నిందితున్ని ఎన్కౌంటర్ చేశారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: