IPL16 కి గ్లామర్ టచ్.. రెడీగా ఉన్న రష్మిక,తమన్నా?

Purushottham Vinay
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ కోసం సంవత్సరం నుంచి ఎంతగానో ఎదురుచూస్తున్న సందర్భం రానే వచ్చింది. ఇక క్రికెట్ అభిమానులకు ఎంటర్టైన్మెంట్ మాములుగా ఉండదు. ఐపిఎల్ 16 వ సీజన్ నేటి నుండే ప్రారంభం కానుంది. నేడు మార్చి 31న సాయంత్రం మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ ఇంకా అలాగే గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య అహ్మదాబాద్ నరేంద్రమోడీ స్టేడియంలో చాలా గ్రాండ్ గా స్టార్ట్ అయ్యి జరగనుంది.ఇక IPL ఓపెనింగ్స్ అంటే పెద్ద పండుగ లాగా చాలా గ్రాండ్ గా జరుగుతాయని తెలిసిందే. ఇక రీసెంట్ గా WPL కూడా ఓపెనింగ్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. బాలీవుడ్ హాట్ బ్యూటీలు వచ్చి డ్యాన్సులు చేశారు, సింగర్స్ కూడా పాటలు పాడారు. IPL ఓపెనింగ్ కి కూడా ఇలా స్పెషల్ పర్ఫార్మెన్స్ లు ఏర్పాటు చేశారు.ఈ సారి IPL ఓపెనింగ్ లో మరింత గ్లామర్ టచ్ ఇవ్వడానికి హాట్ యంగ్ బ్యూటీ రష్మిక మందన్న ఇంకా మిల్కీ బ్యూటీ తమన్నా స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ లు ఇవ్వనున్నారు.


IPL నిర్వాహకులు కూడా అధికారికంగా ప్రకటించగా ఇప్పటికే ఇద్దరూ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోల్ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో అభిమానులు వీరి హాట్ అందాలతో కూడిన స్పెషల్ పర్ఫార్మెన్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇంకా అలాగే వీరితో పాటు బాలీవుడ్ స్టార్ సింగర్ గా దూసుకుపోతున్న ఆర్జిత్ సింగ్ తన సాంగ్స్ తో స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడు.నేటి ఫస్ట్ మ్యాచ్ రాత్రి 7 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ కాబో్తుండగా ఈ స్పెషల్ హాట్ బ్యూటీస్ పర్ఫార్మెన్స్ లు, ఓపెనింగ్ కార్యక్రమాలు సాయంత్రం 6 గంటల నుండే స్టార్ట్ అవుతాయి. ఈసారి ఐపీఎల్ మ్యాచ్ లను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ తో పాటు ఇంకా అలాగే జియో సినిమాస్ యాప్ లో కూడా ఉచితంగా చూడొచ్చు. ఇక ఈ ఎండాకాలం క్రికెట్ అభిమానులకు నిజంగా పెద్ద పండగ లాంటి సీజన్ అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: