నా కెరియర్లో.. అతనే నా హీరో : కోహ్లీ

praveen
రేపటి నుంచి ఐపీఎల్ హడావిడి మొదలు కాబోతుంది . ఈ క్రమంలోనే ప్రతి మ్యాచ్ను వీక్షించి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పొందేందుకు అటు ప్రపంచం క్రికెట్ ప్రేక్షకులు కూడా సిద్ధమైపోయారు. కాగా అద్భుతమైన ఆట తీరు కనబరిచి రికార్డులు కొలగొట్టాలని ఎంతోమంది క్రికెటర్లు కూడా ఎదురుచూస్తూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఇక గత ఏడాది జరిగిన మినీ వేలంలో కొత్త ఆటగాళ్లు జట్టులోకి రావడంతో ఇక అన్ని జట్లు కూడా ఎంతో పటిష్టంగా కనిపిస్తున్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక ప్రతిసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఈసారి కూడా టైటిల్ ఫేవరెట్ గానే ఉంది.

 అయితే ఇలా ఐపీఎల్ ప్రారంభానికి ముందు అటు బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్  విరాట్ కోహ్లీ పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన కెరీర్ కు సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ తన కెరియర్లో హీరో ఎవరు అన్న విషయాన్ని మాత్రం ఇటీవల చెప్పుకొచ్చాడు. అతను ఎవరో కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు క్రికెట్ దేవుడిగా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ అంటూ తెలిపాడు విరాట్ కోహ్లీ.

 ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సచిన్ టెండుల్కర్ తన హీరో అని విరాట్ కోహ్లీ చెప్పాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో సచిన్ తో పాటు వీవ్ రిచర్డ్స్ నా ఆరాధ్య క్రికెటర్లు. వారి తరంలో ఆట స్వరూపాన్ని పూర్తిగా మార్చేశారు. అందుకే వాళ్ళు గొప్ప క్రికెటర్లుగా మారారు. ఇక ప్రత్యేకంగా అయితే నన్ను ఎంతగానో ప్రభావితం చేసింది సచిన్ టెండూల్కర్. అందుకే ఆయన నా హీరో అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇక తన మొబైల్ నిండా కూడా తన కూతురు వామిక ఫోటోలే ఉంటాయని.. భార్య కూతురితో గడిపిన ప్రతి మధుర క్షణాన్ని ఫోన్లో క్యాప్చర్ చేస్తాను అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: