ధోనీకి కెప్టెన్ గా ఉండడం.. చాలా కష్టం : స్మిత్

praveen
ఒకప్పుడు ఐపీఎల్ లో వివిధ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించి స్టార్ ప్లేయర్గా హవా నడిపించిన ఆస్ట్రేలియా సీనియర్ బ్యాట్స్మెన్ స్టివ్ స్మిత్ ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో మాత్రం అన్ సోల్డ్ ఆటగాడి గానే మిగిలిపోయాడు అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ నిరాశ చెందకుండా అటు ఐపీఎల్ లో కామెంటెటర్ గా అవతారమెత్తి తన కామెంట్రీతో ప్రేక్షకులను అదరించబోతున్నాడు. ఈ క్రమంలోనే తన కెరీయర్లో జరిగిన ఎన్నో విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉన్నాడు. స్టీవ్ స్మిత్ ఇక 2017లో రైసింగ్ పూణే సూపర్ జెయింట్స్ జట్టుకు సారద్యం వహించిన రోజులను గుర్తు చేసుకున్నాడు.

 ఆ సమయంలో అటు రైసింగ్ పూణే జట్టుకు సారధిగా స్టివ్ స్మిత్ ఉంటే జట్టులో ఒక సాదాసీదా ఆటగాడిగానే మహేంద్రసింగ్ ధోని ఉన్నాడు. అయితే ఇలా 2017 లో ఐపీఎల్ సీజన్లో ధోనీకి కెప్టెన్గా వ్యవహరించడం చాలా కష్టంగా అనిపించింది చెప్పుకొచ్చాడు. ఆ సీజన్లో లో ఫైనల్ చేరుకున్న పూనే ఒక్క పరుగు తేడాతో టైటిల్ కు దూరమైంది. నన్ను కెప్టెన్ గా నియమించాలని అనుకుంటున్నట్లు చెప్పగానే కొంచెం కష్టంగా అనిపించింది. ఎందుకంటే రైసింగ్ పూణే జట్టులో సారధిగా పేరు సంపాదించుకున్న ధోని ఉన్నాడు. ఇక ఆ సీజన్లో ధోని అద్భుతంగా ఆడాడు. అన్ని రకాలుగా అతను నాకు సహాయం అందించాడు.

 ధోని లాంటి ప్లేయర్కు కెప్టెన్గా వ్యవహరించడం మాత్రం నిజంగా గొప్ప అనుభవం అని చెప్పాలి. అతను ఒక గొప్ప వ్యక్తి. అదే సమయంలో ధోనీకి కెప్టెన్గా వ్యవహరించడం చాలా కష్టం కూడా. ఎందుకంటే ధోని నుంచి ఏమి ఆశించాలో నాకు మొదట్లో తెలియలేదు. ఆడిన అన్ని జట్లకు అతడు కెప్టెన్గా వ్యవహరించాడు. ఐపీఎల్ లో ప్రతి సీజన్లో చెన్నైకి సారథిని వహించాడు. నన్ను కెప్టెన్ గా ఉండమన్నప్పుడు షాక్ కి గురయ్యా. ఏం చెప్పాలో అర్థం కాలేదు. కెప్టెన్సీ గురించి ధోనితో మాట్లాడారా అని ముందుగా జట్టు యాజమాన్యాన్ని అడిగాను. కాగా ఆ సమయంలో జట్టును మార్గ నిర్దేశం చేయడంలో ధోని తోడ్పడిన విధానానికి సరిగ్గా కృతజ్ఞతలు తెలుపలేకపోయా అంటూ స్మిత్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: