వారెవ్వా.. సెంచరీ కొట్టేసిన లియోనల్ మెస్సి?

praveen
ఫుట్బాల్ ఆటలో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న లియోనల్ మెస్సికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచ నలుమూలల్లో కూడా ఇతగాడి అతను ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పాలి. ఇక భారత్లో సైతం క్రికెటర్లను ఆరాధించినట్లుగానే లియోనల్ మెస్సిని కూడా ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో అయితే కేరళలో ఎంతోమంది అభిమానులు లియోనల్ మెస్సి కి సంబంధించి భారీ కట్ అవుట్లను కూడా ఏర్పాటు చేయడం చూస్తూ ఉంటారూ.

 ఇలా తన ఆటతీరుతో అందరిలో కెల్లా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు మెస్సి. మైదానంలో చిరుత పులిలా కదులుతూ.. ఏకంగా ప్రత్యర్థులను వణికిస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక ఇప్పటికే తన ఆటతో ప్రపంచ రికార్డును కొల్లగొట్టిన మెస్సి ఇక ఇటీవలే మరో అరుదైన మైలురాయి చేరుకున్నాడు అని చెప్పాలి. కోరాకుతో జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్లో అర్జెంటీనా జట్టు 7-0 తేడాతో రికార్డు విజయాన్ని అందుకుంది. అయితే ఈ మ్యాచ్ లో లియోనల్ మెస్సి హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు అని చెప్పాలి.

 ఇక ఇలా మెస్సి చేసిన హ్యాట్రిక్ గోల్స్ తో 100 గోల్స్ మైలు రాయిని అందుకున్నాడు అని చెప్పాలి. ఇక ప్రస్తుతం మెస్సి ఖాతాలో 102 గోల్స్ ఉన్నాయి. అంతేకాదు అంతర్జాతీయ ఫుట్బాల్ ఆటలో అత్యధిక గోల్స్ కొట్టిన జాబితాలో మెస్సి 174 మ్యాచ్లో 102 గోల్స్ తో మూడో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో క్రిస్టియానో రోనాల్డో 198 మ్యాచ్ లలో 122 గోల్స్ చేసి ఉన్నాడు.  రెండో స్థానంలో ఇరాన్ కు చెందిన అలీ దాయి 148 మ్యాచులలో 109 గోల్స్ తో ఉన్నాడు అని చెప్పాలి. అంతేకాకుండా ఇక అర్జెంటీనా జట్టు తరఫున 100 మ్యాచ్లో ఆడిన ప్లేయర్ గా కూడా లియోనల్ మెస్సి అరుదైన రికార్డును సృష్టించాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: