వైరల్ : ఆటగాళ్లతో కలిసి.. క్రికెట్ ఆడిన ప్రధానమంత్రి?

praveen
సాధారణంగా క్రికెట్లో ఆటగాళ్లు మంచి ప్రదర్శన చేసినప్పుడు అందరు ప్రశంసలు కురిపిస్తూనే ఉంటారు . ఇక మాజీ ఆటగాళ్లు, అభిమానులు, ప్రేక్షకులు ప్రశంసలు కురిపించడం సర్వసాధారణం. కానీ దేశానికి ప్రధానమంత్రిగా ఉంటూ పాలన మొత్తం చూసుకుంటున్న వ్యక్తి ఏకంగా క్రికెటర్ల ప్రతిభను గుర్తించి ప్రశంసలు కురిపిస్తే అది ఆ క్రికెటర్లకు ఎంతో ప్రత్యేకమైనది చెప్పాలి. ఈ క్రమంలోనే దేశం తరఫున మంచి విజయాలు సాధించిన వారిని ప్రోత్సాహించేందుకు ఎప్పటికప్పుడు ప్రధానమంత్రిగా కొనసాగుతున్న వారు ఆటగాళ్ల  ప్రతిభ పై ప్రశంసలు కురిపించడం లాంటివి చేస్తూ ఉంటారు.

 ఇక కొన్ని కొన్ని సార్లు ఏకంగా స్వయంగా కలిసి మరి ప్లేయర్లను అభినందిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ఏకంగా ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టును ఇక ఆ దేశ ప్రధాని రిషి సునక్ అధికారిక భవనంలో కలిశారు. భవనంలోని గార్డెన్ లో ఆటగాళ్లంతా కూడా ఇక ప్రధానమంత్రి ఋషి సునాత్తో కలిసి సరదాగా గడిపారు అని చెప్పాలి. అంతేకాదు ఇక క్రికెట్ ప్లేయర్లతో కలిసి రిషి సరదాగా క్రికెట్ కూడా ఆడటం గమనార్హం. ఆల్ రౌండర్ సామ్ కరన్ బౌలింగ్ చేస్తూ ఉంటే రిషి సునక్ బ్యాటింగ్ చేశారు.

 ఇక కొన్ని మంచి షాట్లు ఆడిన సునక్ క్రీస్ జోర్దాన్ బంతికి అవుట్ అయ్యారు అని చెప్పాలి. ఇక తర్వాత ఆయన సైతం ఆటగాళ్లకు బౌలింగ్ చేశారు. కెప్టెన్ జోష్ బట్లర్ తో పాటు సామ్ కరణ్, ఫేసర్ క్రిస్ జోర్డాన్, లియన్ లివింగ్ స్టోన్ సహ మరి కొంతమంది ఆటగాళ్లు కూడా ఇక ఇలా పీఎం రిషి సునక్ ను  కలుసారు అని చెప్పాలి. ఇక ఇలా ప్రధానమంత్రి తో ఇంగ్లాండ్ జట్టులోని ఆటగాళ్లు అందరూ కూడా ఎంతో సరదాగా గడిపిన వీడియో ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. కాగా గత ఏడాది మెన్స్ టి20 వరల్డ్ కప్ 2022లో భాగంగా ఫైనల్లో పాకిస్తాన్ ను ఓడించిన ఇంగ్లాండ్ జట్టు విశ్వ విజేతగా నిలిచింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: