సూర్య మళ్లీ ప్రకాశించాలంటే.. అలా జరగాలి : యువరాజ్

praveen
ప్రస్తుతం భారత క్రికెట్లో ఎక్కడ చూసినా ఒకే విషయం గురించి చర్చ జరుగుతుంది. అదే వన్డే ఫార్మాట్లో సూర్య పేలవమైన  ఫామ్ గురించి. సాధారణంగా ఒక ఆటగాడు మంచి ప్రదర్శన చేసి జట్టును గెలిపించాడు అంటే చాలు అతనిపై ప్రశంసలు కురిపిస్తూ ప్రేక్షకులు అందరూ కూడా ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటారు. ఒకవేళ అతనే మంచి ప్రదర్శన చేయకపోతే ఇక అతన్ని తిట్టిపోస్తూ ఉంటారు అని చెప్పాలి. సూర్య కుమార్ విషయంలో ఇదే జరుగుతుంది.

 మొన్నటికి మొన్న టి20 ఫార్మాట్లో విధ్వంసకరమైన ఇన్నింగ్స్ లతో జట్టుకు విజయాన్ని అందించినప్పుడు సూర్య కుమార్ తోపు.. అతని కంటే మించిన వాడు ఇంకెవరూ లేరు అంటూ తెగ పొగిడేసారు. కానీ వన్డే ఫార్మాట్లో అతను విఫలమవుతుంటే మొన్నటి వరకు పొగిడిన వారి ఇక ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. వరుసగా మూడు మ్యాచ్లలో కూడా సూర్య కుమార్ యాదవ్ మొదటి బందుకే డక్ అవుట్ గా వెను తిరగడం తో ఇక అభిమానులు సైతం కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇలాంటి సమయంలో కొంత మంది మాజీ ప్లేయర్లు సూర్య కుమార్ యాదవ్ కు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 ఈ క్రమం లోనే ఆస్ట్రేలియా తో జరిగిన వన్డే సిరీస్ లో సూర్య కుమార్ యాదవ్ వరుసగా మూడు సార్లు డక్ అవుట్ కావడం గురించి మాజీ ఆల్రౌండర్ యువరాజ్ స్పందిస్తూ మద్దతుగా నిలిచాడు. ప్రతి క్రీడాకారుడి కెరియర్ లో ఎత్తుపల్లాలు సహజం. ఏదో ఒక టైం లో మనం అనుభవించే ఉంటాం. భారత జట్టుకు సూర్యకుమార్ యాదవ్ చాలా కీలకమైన ఆటగాడు అని నేను భావిస్తున్నాను. అతనికి మరిన్ని అవకాశాలు ఇస్తే వరల్డ్ కప్ లో రాణిస్తాడు. సహచర ఆటగాళ్లు అండగా నిలిస్తే సూర్య మళ్లీ ప్రకాశిస్తాడు అంటూ యువరాజ్ కామెంట్ చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: