వరల్డ్ కప్ ముందు.. లీవ్ అవసరమా రోహిత్ : గవాస్కర్

praveen
రోహిత్ శర్మ టీమిండియా సారధ్య బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎప్పుడూ కూడా పూర్తిస్థాయిలో అటు జట్టుకు అందుబాటులో ఉండలేదు అని చెప్పాలి. ఏదో ఒక ఫార్మాట్ కి వరుసగా బ్రేక్ తీసుకుంటూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. అయితే ఇక ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్ సమయంలో కూడా కుటుంబ బాధ్యతల పేరుతో అటు రోహిత్ శర్మ అందుబాటులో లేకుండానే పోయాడు. దీంతో ఇక వైస్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యానే కెప్టెన్సీ బాధ్యతలను భుజానా వేసుకొని ముందుకు నడిపించాడు. ఇక అతనికి కెప్టెన్సీలో టీమ్ ఇండియా మొదటి మ్యాచ్ లో విజయం సాధించింది అని చెప్పాలి.

 ఇక ఆ తర్వాత రోహిత్ రెండో వన్డే మ్యాచ్ నుంచి అందుబాటులోకి రాగా.. రోహిత్ కెప్టెన్సీ వహించిన రెండు మ్యాచ్లలో కూడా టీమిండియా ఓడిపోవడం గమనార్హం. ఇదంతా పక్కన పెడితే ఇక రోహిత్ ఇలా కుటుంబ బాధ్యతలు నేపథ్యంలో  జట్టుకు దూరంగా ఉండటం పై మాత్రం అటు సునీల్ గావాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. రోహిత్ టీమ్ ఇండియాకు సారథి.. అతను ప్రతి మ్యాచ్ కు అందుబాటులో ఉండాలి. అయితే కుటుంబ బాధ్యతలు వల్ల అతను అక్కడ ఉండాల్సి వచ్చిందని నాకు తెలుసు. అది నేను అర్థం చేసుకోగలను. కానీ ఒక్క మ్యాచ్ కోసం జట్టు కెప్టెన్గా వ్యవహరించే వారు ఎక్కడ ఉండరు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఇది ఏ ఇతర ఆటగాడికైనా జరగొచ్చు. నాయకత్వంలో కొనసాగింపు ఉండాలి అది జట్టుకు చాలా అవసరం కూడా.

 అప్పుడే అందరూ నీతో ఉన్నారని భావన కూడా కలుగుతూ ఉంటుంది. ఇక అలాంటి సమయంలోనే జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించేందుకు అవకాశం ఉంటుంది. లేదంటే ఒక జట్టుకు ఇద్దరు నాయకులు ఉంటారు. జట్టు సభ్యులు ఇతరు నాయకుల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇది జట్టుకు ఏ మాత్రం మంచిది కాదు. వన్ డే ప్రపంచ కప్ ప్రారంభమైతే మీరు కుటుంబ బాధ్యతలు నిర్వహించలేరు. అత్యవసర పరిస్థితుల మినహా మిగతా ఏ పనులున్నా టోర్నమెంట్ ముందే పూర్తి చేసుకోవాలి అంటూ సునీల్ గావాస్కర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: