వరల్డ్ కప్ డేట్ ఫిక్స్.. ఎప్పటినుంచో తెలుసా?

praveen
ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే  వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది. అయితే ఇక ఈ వరల్డ్ కప్ లో ఆతిథ్య భారత జట్టు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. అయితే సాధారణంగానే భారత జట్టు అటు సొంత గడ్డపై ప్రత్యర్థులను చిత్తు చేస్తూ పూర్తి ఆధిపత్యాన్ని చలాఇస్తూ ఉంటుంది. దీంతో ఇక ఎన్నో రోజుల నుంచి టీమిండియాకు అందరిని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ఇక ఈ ఏడాది భారత్ కే దక్కడం ఖాయమని అటు భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా గట్టి నమ్మకాన్ని పెట్టుకుంటున్నారు.

 అదే సమయంలో ఇక ప్రపంచ క్రికెట్లో మేటిజట్లుగా కొనసాగుతున్న టీంలు అన్నీ కూడా విశ్వ విజేతగా నిలవడం పైనే దృష్టి పెట్టి  పదునైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నాయి అని చెప్పాలి. ఇక ఈ వరల్డ్ కప్ పోరును వీక్షించేందుకు అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక వరల్డ్ కప్ షెడ్యూల్ ఎప్పుడు విడుదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అక్టోబర్ నెలలో వన్డే వరల్డ్ కప్ ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉంది అన్నది తెలుస్తుంది.

 ఇక భారత్లో జరుగునున్న వన్డే వరల్డ్ కప్ ను ఎప్పుడు నిర్వహించాలి అనే విషయంపై బీసీసీఐ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. టోర్నీని అక్టోబర్ 5న ప్రారంభించి ఇక నవంబర్ 19న ముగించాలని అనుకుంటుందట బీసీసీఐ. ఇక అహ్మదాబాద్ స్టేడియంలో ఫైనల్ నిర్వహించే అవకాశం ఉంది అన్నది తెలుస్తుంది. హైదరాబాద్ తో పాటు బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గౌహతి, కోల్కతా, లక్నో, ఇండోర్, రాజ్కోట్, ముంబై వేదికలుగా తొలి జాబితాను విడుదల చేసేందుకు బీసీసీఐ సిద్ధమవుతుందట. కాగా  ఈ వరల్డ్ కప్ లో ఈసారి పది జట్లు పోటీ పడబోతున్నాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: