మ్యాచ్ మధ్యలో అనుకోని అతిథి.. తల గోక్కున్న రోహిత్?

frame మ్యాచ్ మధ్యలో అనుకోని అతిథి.. తల గోక్కున్న రోహిత్?

praveen
సాధారణంగా మైదానంలో మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతున్న సమయంలో కొన్ని కొన్ని సార్లు అనుకోని అతిధులు మైదానంలోకి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఆ అనుకోని అతిధులు ఎవరో కాదు స్టేడియంలో మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులే. మైదానంలో ఉన్న తమ అభిమాన క్రికెటర్లను కలవడానికి కాస్త రిస్క్ చేసి మరి సెక్యూరిటీని దాటుకుని మైదానంలోకి పరిగెత్తుకుంటూ వస్తారు. ఇలా చేసిన సమయంలో కొన్ని కొన్ని సార్లు మ్యాచ్ కు అంతరాయం కూడా కలుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే అభిమానులు మాత్రమే కాదు కొన్ని కొన్ని సార్లు ఏకంగా పాములు కూడా మైదానంలోకి వచ్చి ఆటగాళ్లను భయపెట్టడం లాంటి ఘటనలు ఇప్పటివరకు చాలానే చూసాము అని చెప్పాలి.

 అయితే ఇక ఇటీవల చెన్నైలోని చపాక్ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన మూడవ వన్డే మ్యాచ్లో కూడా ఇలాగే జరిగింది. మ్యాచ్ మధ్యలో ఒక అనుకోని అతిధి ఎంట్రీ ఇచ్చింది. ఇక గ్రౌండ్ స్టాఫ్ మొత్తాన్ని కూడా ముప్పు తిప్పులు పెట్టింది అనుకోని అతిథి. ఇంతకీ ఆ అతిథి ఏంటో కాదు ఒక శునకం కావడం గమనార్హం. ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తుండగా 43 ఓవర్లో ఒక శునకం మైదానంలోకి చొరబడి గ్రౌండ్ సిబ్బందికి పట్టుకొండి చూద్దాం అన్నట్లుగా ఛాలెంజ్ విసిరింది. ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది ఆ శూనకాన్ని మైదానం నుంచి బయటికి తరిమేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు. ఈ మొత్తం తంతు చూస్తూ ఉండిపోయిన కెప్టెన్ రోహిత్ శర్మ తల గోక్కుంటూ నవ్వుకున్నాడు. ఈ వీడియో ట్విటర్లో వైరల్ గా మారింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మూడో మ్యాచ్లో గెలుస్తుంది అనుకున్న మ్యాచ్లో టీమ్ ఇండియా బ్యాటింగ్ విభాగం వైఫల్యంతో ఓడిపోయింది అని చెప్పాలి. మూడో మ్యాచ్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకుంటుంది అని నమ్మకం పెట్టుకున్న అభిమానులకు నిరాశే ఎదురయింది. చివరికి రెండు ఒకటి తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: