సూర్యతో పాటు.. ఆ లెజెండ్స్ కూడా.. వరుసగా మూడుసార్లు డకౌట్?

praveen
సున్నా మీద భారతీయులకే పేటెంట్ రైట్ ఉంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే సున్నాను కనిపెట్టింది భారత శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట. ఇక ఇప్పుడు ఆ సున్నానే లేకపోతే గణితశాస్త్రం అనేదే లేదు అని చెప్పడంలోనూ అతిశయోక్తి లేదు. అయితే ఇక ఎలాగో 0 భారతీయులే కనిపెట్టారు కదా అని ఇక నేటి రోజుల్లో క్రికెటర్లు ఈ సున్నాని ఎక్కువగా ఇష్టపడుతున్నారో లేకపోతే ఇంకేదైనా కారణం ఉందో తెలియదు కానీ ఇక బరిలోకి దిగిన చాలాసార్లు పరుగులు చేయకుండానే 0 పరుగులతో చివరికి పెవిలియన్ చేరుతూ ఉన్నారు. ఇక ఇటీవల సూర్య కుమార్ యాదవ్ సైతం ఇలాంటి ఆట తీరుతో వార్తల్లో నిలిచాడు అన్న విషయం తెలిసిందే.

 ఆర్యభట్ట కనిపెట్టిన సున్న తనకు ఎంత ఇష్టమో అన్న విషయాన్ని ఇక ఇటీవల వన్డే సిరీస్ లో మూడు సార్లు నిరూపించాడు సూర్య కుమార్ యాదవ్. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డే మ్యాచ్ లలో కూడా 0 పరుగులకే అవుట్ అయ్యాడు అని చెప్పాలి. టి20 ఫార్మాట్లో విధ్వంసకర ప్లేయర్ గా పేరున్న సూర్య కుమార్ యాదవ్ ని అటు వన్డే ఫార్మాట్లోకి ఎంతో నమ్మకం పెట్టుకుని ఎంపిక చేసింది టీమిండియా యాజమాన్యం. కానీ సూర్య కుమార్ ఎక్కడ పెద్దగా ప్రభావం చూపు లేకపోయాడు. అప్పటికే అయ్యర్ గాయపడటంతో వేరే గత్యంతరం లేక అతని జట్టులో కొనసాగించింది.

 అయితే అడపాదడపా ప్రదర్శన అయినా చేస్తాడు అని భావించింది. కానీ సున్నా పరుగులకే అతను వికెట్ కోల్పోయి పెవిలియన్  చేరాడు. మూడో మ్యాచ్లో కూడా గోల్డెన్ డకౌట్ గా వెను తిరిగాడు. అయితే ఇప్పుడు వరకు భారత క్రికెట్ లో సూర్యకుమార్ మాత్రమే కాకుండా ఇలా వరుసగా మూడుసార్లు గోల్డెన్ డకౌట్ అయిన ప్లేయర్లు చాలామంది ఉన్నారు. వీరిలో లెజెండ్స్ అయినా సౌరబ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, బూమ్రా, సచిన్ టెండూల్కర్ లు ఇలాగే వరుసగా మూడు మ్యాచ్ లలో గోల్డెన్ డకౌట్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: