కోహ్లీ టీ20లను.. వదిలేస్తేనే బెటర్ : పాక్ మాజీ

praveen
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ఎవరి పేరిట ఉంది అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. అది ఎవరో కాదు భారత క్రికెట్ దిగ్గజం అయిన సచిన్ టెండుల్కర్ పేరిట ఉంది అని చెప్పాలి. ఇప్పటివరకు ఏ ఆటగాడు కూడా ఈ రికార్డుకు చేరువలోకి రాలేదు అని చెప్పాలి. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేయడం ఖాయమని క్రికెట్ ప్రేక్షకులలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరకు మూడు ఫార్మట్లలో కలిపి 75 సెంచరీలు చేశాడు కోహ్లీ.

 దీంతో ఇక సచిన్ 100 సెంచరీల రికార్డును బ్రేక్ చేసే అవకాశం కేవలం ఒక్క విరాట్ కోహ్లీకి మాత్రమే ఉంది అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ఇక విరాట్ కోహ్లీ 100 సెంచరీలు సాధించాలి అంటే టీ20 ఫార్మాట్ కు దూరం కావాలి అంటూ పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. టి20 ఫార్మాట్ అతని శక్తిని చాలా వరకు హరిస్తుందని.. అందుకే పొట్టి ఫార్మాట్ కి రిటైర్మెంట్ ప్రకటించి వన్డేలు టెస్టులకు పరిమితం కావాలంటూ సూచించాడు. ఒక క్రికెటర్ గా మీరు నన్ను అడిగితే విరాట్ కోహ్లీ టీ20 లలో ఆడటం మానేసి టెస్ట్, వన్డే ఫార్మాట్లకు మాత్రమే పరిమితం కావాలని చెబుతా.

 ఎందుకంటే కోహ్లీ ఎంతో ఉత్సాహంగా ఉండే వ్యక్తి. టి20 ఫార్మాట్ అతని శక్తిని హరిస్తుంది. అతను టి20 లలో ఆడాలనుకుంటున్నాడు. అతనికి ఈ ఫార్మాట్ అంటే కాస్త ఎక్కువగానే ఇష్టం ఉంది. అయితే తన శరీరాన్ని కాపాడుకోవాలి అంటే మాత్రం టి20 ఫార్మాట్ ను వదిలేయాలి. ప్రస్తుతం అతని వయసు 34 ఏళ్ళు. ఇంకో 6 నుంచి 8 ఏళ్లు సులభంగా ఆడగలడు. మరో 30 లేదా 50 టెస్ట్ మ్యాచ్లు ఆడితే ఆ మ్యాచ్లో 25 సెంచరీలు చేయడం అతనికి కష్టం కాదని కచ్చితంగా చెబుతున్న.. కోహ్లీ ఫిట్నెస్ను కాపాడుకుంటూ మానసిక ఆరోగ్యంతో ఇక 100 సెంచరీలు బ్రేక్ చేయాలని కోరుకుంటున్నా అంటూ షోయబ్ అక్తర్ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: