ధోనికి ఇదే చివరి ఐపిఎల్.. షేన్ వాట్సన్ ఏమన్నాడంటే?

praveen
2023 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన హడావిడి మొదలైంది . ఇక భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఐపీఎల్ మొదటి మ్యాచ్ ఎప్పుడు జరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. మార్చ్ 31వ తేదీ నుంచి ఇక ఈ ఐపీఎల్ క్రికెట్ సందడి మొదలు కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక అన్ని జట్లు కూడా టైటిల్ గెలవడమే లక్ష్యంగా బలిలోకి దిగేందుకు సిద్ధమవుతూ ఉన్నాయి. అయితే అటు ధోని అభిమానులు మాత్రం ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు అని చెప్పాలి.

 ఎందుకంటే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన మహేంద్ర సింగ్ ధోని... ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా కొనసాగుతున్నాడు. అయితే ఇక ఏడాదికి ఒక్కసారి కేవలం ఐపిఎల్ లో మాత్రమే ధోని ఆట చూసి సంతోషిస్తున్నారు అభిమానులు. కానీ ఇక వచ్చే ఏడాది నుంచి ధోని ఐపీఎల్లో ఆడతాడా లేదా అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.. ఎందుకంటే ధోని కి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ ఎన్నో వార్తలు తెరమీదకి వస్తూ ఉన్నాయి. బెన్ స్టోక్స్ కి సారధ్య బాధ్యతలు అప్పగించి ధోని.. ఇక ఐపీఎల్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఎంతో మంది చర్చించుకుంటున్నారు.

 అయితే ఇక ఇటీవల ఇదే విషయంపై ఐపీఎల్ లో ధోని సహచరుడు చెన్నై సూపర్ కింగ్స్ మాజీ స్టార్ ప్లేయర్ అయిన షేన్ వాట్సన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోని ఇప్పటికి చాలా ఫీట్ గా ఉన్నాడు. బ్యాటింగ్ వికెట్ కీపింగ్ అద్భుతంగా చేస్తున్నాడు అంటూ షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు. ఇక ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అంటూ వార్తలు వస్తున్నాయి. తానైతే అలా జరుగుతుందని అనుకోవట్లేదు. ఎందుకంటే అతనికి మరో మూడు నాలుగు ఏళ్ళు క్రికెట్ ఆడే సత్తా ఉంది. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ విజయవంతం కావడానికి ధోని కెప్టెన్సీ నే కారణం అంటూ షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: