IND vs AUS 1st ODI: టాస్ గెలిచిన టీం ఇండియా?

Purushottham Vinay
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇండియా, ఆస్ట్రేలియా మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యింది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ని ఎంచుకుంది.దీంతో మొదట ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆడటం లేదు. అతని స్థానంలో హార్దిక్ పాండ్యా జట్టు బాధ్యతలు చేపట్టాడు. సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు రోహిత్ శర్మ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కుటుంబ కారణాల రీత్యా ఈ సిరీస్‌లోని మొదటి వన్డే నుంచి రోహిత్ విశ్రాంతి తీసుకున్నట్లు బీసీసీఐ ఇప్పటికే తెలిపింది.ఈ సంవత్సరం చివర్లో జరగనున్న ప్రపంచకప్ సన్నాహాలపైనే టీమిండియా ఫుల్ గా ఫోకస్ పెట్టింది. మూడు సంవత్సరాల తర్వాత ఈ మైదానంలో రెండు జట్లు కూడా ముఖాముఖి తలపడనున్నాయి. ఇప్పటి దాకా ఇక్కడ భారత్ ఇంకా ఆస్ట్రేలియా మధ్య నాలుగు మ్యాచ్‌లు జరిగాయి. వీటిలో టీం ఇండియా ఒక్కటి మాత్రమే గెలవగలిగింది.అలాగే ఆస్ట్రేలియా మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. చివరిసారిగా 2020 వ సంవత్సరంలో ఇక్కడ రెండు జట్లు ముఖాముఖి తలపడినప్పుడు ఆసిస్ జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.


శ్రీలంక, న్యూజిలాండ్‌లతో జరిగిన రెండు వేర్వేరు వన్డే సిరీస్‌లలో మొత్తం ఆరు మ్యాచ్‌లను గెలుచుకోవడం ద్వారా ఇండియా జట్టు ఈ సంవత్సరం ఘనంగా ప్రారంభించింది. ఈ ఆరు వన్డేల్లో శుభ్‌మన్ గిల్ మూడు సెంచరీలు ఇంకా 113.40 సగటుతో మొత్తం 567 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లి ఈ సంవత్సరం 67.60 సగటుతో 338 పరుగులు చేశాడు.కెప్టెన్ పాట్ కమిన్స్ లేకపోయినా కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ మ్యాచ్ గెలిచే సత్తా వార్నర్, అగర్‌లతో కూడిన ఆస్ట్రేలియా టీంకి ఉంది. కమిన్స్ గైర్హాజరీలో ఆస్ట్రేలియాకు స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ వహిస్తున్నాడు.ఇంకా ఈ సిరీస్‌కు కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్ అందుబాటులో లేరు. డేవిడ్ వార్నర్, ఆల్ రౌండర్ అష్టన్ అగర్ టీంలో చేరారు.రెండు టీంలు మధ్య ఇప్పటి దాకా జరిగిన 143 వన్డేల్లో ఇండియన్ టీం కేవలం 53 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ఆస్ట్రేలియా జట్టు మొత్తం 80 మ్యాచ్‌ల్లో గెలిచింది. అయితే 10 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. అదే సమయంలో ఇండియాలో రెండు జట్ల మధ్య ఇప్పటి దాకా 64 మ్యాచ్‌లు జరిగాయి. ఈ సమయంలో టీమిండియా మొత్తం 29 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక 30 మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. 5 మ్యాచ్‌ల్లో మాత్రం ఫలితం తేలలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: