కోహ్లీ 100 సెంచరీలు చేస్తాడా.. షోయబ్ అక్తర్ ఏమన్నాడంటే?

praveen
ప్రపంచ క్రికెట్లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ అందరిని దాటేసి ఇక అత్యుత్తమ ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు. టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే తాను చరిత్రలో నిలిచిపోయే ఆటగాడిని అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. ఇప్పుడు వరకు రికార్డుల విషయంలో ఏ ఆటగాడికి అందనంత దూరంలో ఉన్నాడు అని చెప్పాలి. ఇక విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాల్సిన రికార్డ్ ఏదైనా ఉంది అంటే అది భారత లెజెండరీ క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్ సాధించిన 100 సెంచరీల రికార్డు మాత్రమే అని చెప్పాలి.

 ఎందుకంటే ప్రస్తుతం క్రికెట్ చరిత్రలో ఉన్న ఎంతోమంది మాజీ ప్లేయర్లు సాధించిన రికార్డులను ఇప్పటికే విరాట్ కోహ్లీ బద్దలు కొట్టేసి తన పేరును లికించుచుకున్నాడు.. ఒక్క సచిన్ 100 సెంచరీల రికార్డు మాత్రమే ఇంకా మిగిలి ఉంది. అయితే ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీ 75 సెంచరీలు చేశాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా తో జరిగిన నాలుగో టెస్టులో సెంచరీ చేయడం ద్వారా కోహ్లీ ఇక ఈ రికార్డు సృష్టించాడు. దీంతో కోహ్లీ సచిన్ 100 సెంచరీల రికార్డును బద్దలు కొడతాడా లేదా అన్న దానిపై చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి.

 ఇక ఇదే విషయంపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్బర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ తప్పకుండా సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగామిస్తాడు అంటూ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. 100 సెంచరీల రికార్డును బద్దలు కొట్టడమే కాదు.. 110 సెంచరీలు సాధిస్తాడు అంటూ కామెంట్ చేశాడు షోయబ్ అక్తర్. అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్ద కాలం గడుస్తున్న కోహ్లీ ఇంకా పరుగుల వేటలో దూసుకుపోతున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. అయితే ఇప్పటికే సెంచరీ తో మళ్లీ మునుపటి ఫామ్ నిరూపించిన కోహ్లీ ఇక ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో మరోసారి సెంచరీ చేసే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: