ఎట్టకేలకు WPL లో బోణీ కొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు !

VAMSI
మహిళల ప్రీమియర్ లీగ్ లో భాగంగా నిన్న రాత్రి జరిగిన మ్యాచ్ లో అన్ని విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చెలాయించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ను విజయం వరించింది. పురుషుల ఐపీఎల్ లాగానే ఇప్పటి వరకు 15 సీజన్ లు జరిగినా ఒక్కసారి కూడా కప్ ను అందుకోలేకపోయింది. కనీసం మహిళల ప్రీమియర్ లీగ్ లో అయినా అదృష్టం మారుతుంది అని భావించిన యాజమాన్యానికి చుక్కెదురైంది అని చెప్పాలి. ఎందుకంటే కేవలం అయిదు టీం లు మాత్రం పోటీ పడుతున్న ఈ టోర్నీలో బెంగుళూరు తో పాటుగా ముంబై ఇండియన్స్ , యూపీ వారియర్స్ , ఢిల్లీ క్యాపిటల్స్ మరియు గుజరాత్ జయింట్స్ జట్లు పోటీ పడుతున్నాయి.
ఇక ఇప్పటి వరకు చూస్తే ముంబై అత్యధికంగా ఆడిన అయిదు మ్యాచ్ లలోనూ గెలిచి ప్లే ఆఫ్ కు అర్హత సాధించింది. కాగా నిన్న బెంగుళూరు మరియు యూపీ వారియర్స్ లు తలపడగా, మొదట బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ బ్యాటింగ్ లో దారుణంగా ఆడి కేవలం 135 పరుగులకే ఆల్ అవుట్ అయింది. బ్యాటింగ్ లో మరోసారి హారిస్ రాణిసిన్హాడంతో ఆమాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. ఇక బదులుగా బెంగుళూరు కూడా ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా నైట్ (24), కనికా ఆహూజా (46) మరియు రిచా ఘోష్ (31) పరుగులు చేసి రాణించడంతో మరో రెండు ఓవర్ లు మిగిలి ఉండగానే అయిదు వికెట్లతో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్ తో ఆరు మ్యాచ్ లలో ఒకటి గెలిచి పాయింట్ల పట్టికలో బోణీ కొట్టింది. ఇక బెంగుళూరు కు మిగిలింది రెండు మ్యాచ్ లు కావడంతో, ప్లే ఆప్స్ కు చేరుతుందా అన్నది వేయి డాలర్ల ప్రశ్నగా మిగిలింది. మరి చూద్దాం రానున్న రెండు మ్యాచ్ లో భారీ విజయాలు సాధించి ఇతర టీం లపై ఆధాపరపడాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: