కొంతమందికి పూజ చేసే విధానం తెలియక పూజలో ఏ వస్తువులు వాడాలో తెలియక అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉంటారు. తెలియక చేసే తప్పులను దేవుడు క్షమిస్తాడు. కానీ తెలిసి కూడా చేస్తే ఆ తప్పులను దేవుడు క్షమించలేడు. అయితే చాలామంది ఎంతో పవిత్రంగా చేసే శివుడి పూజలో ఈ ఐదు వస్తువులను వాడకూడదు అని బ్రాహ్మణులు చెబుతున్నారు.మరి ఇంతకీ శివ పూజలో వాడకూడని ఆ వస్తువులు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. శివుడి పూజ అనగానే చాలామందికి మారేడు దళం గుర్తుకువస్తుంది. అయితే శివుడికి మారేడు దళం సమర్పిస్తారు.కానీ తులసి ఆకులను మాత్రం అస్సలు సమర్పించవద్దు.అయితే తులసిని అన్ని పూజల్లో ఎక్కువగా వాడతారు. కానీ ఒక్క శివ పూజలో మాత్రం వాడకూడదట.దానికి కారణం తులసి చెట్టు విష్ణువుకి ఎంతో ప్రీతికరమైనది.
అందుకే ఈ ఆకులను శివుడి పూజలో సమర్పించరు. అలాగే ఈ వచ్చే శివరాత్రి రోజు తులసి దళాలను పూజలో అస్సలు సమర్పించకండి. అలాగే శివుడి పూజలు లో శంఖాన్ని కూడా వాడకూడదు. శివుడికి శంఖాన్ని ఉపయోగించి అభిషేకం చేయకూడదు.ఎందుకంటే శంఖం కూడా విష్ణువుకి ప్రీతికరమైనది.కాబట్టి శివ పూజలో శంఖాన్ని ఉపయోగించి అభిషేకం చేయకూడదు. అలాగే శివ పూజ చేసేటప్పుడు కేతకి పువ్వులను కూడా వాడకూడదు. దానికి కారణం కేతకి పువ్వులు బ్రహ్మదేవుడు చెప్పిన అబద్దానికి సాక్ష్యంగా నిలిచాయి. అందుకే ఆ పువ్వులను శివ పూజలో వాడకూడదని శివుడు శాపం పెట్టాడట. అందుకే ఈ పువ్వులను శివుడి పూజలో ఉపయోగించరు. విరిగిన బియ్యాన్ని కూడా శివుడి పూజలో ఉపయోగించకూడదట.
అయితే చాలామంది పూజ చేసేటప్పుడు దేవుడికి అక్షింతలు వేస్తూ ఉంటారు.అలా వేసే సమయంలో శివుడికి విరగని బియ్యాన్ని మాత్రమే అక్షింతలుగా కలిపి దేవుడికి సమర్పించాలని అంటున్నారు. ఇక శివ పూజలో చాలామంది తెలియకుండా ఉపయోగించే మరో వస్తువు కుంకుమ.. ఇదేంటి కుంకుమను అన్ని దేవుళ్ళ పూజలో వాడతారు కదా.. శివుడికి ఎందుకు వాడకూడదు అని మీకు డౌట్ రావచ్చు. అయితే కుంకుమ పార్వతి దేవికి ఎంతో ప్రీతికరమైనదట. ఎల్లప్పుడూ పార్వతి దేవికి కుంకుమ ఇష్టంగా ఉండడం వల్ల దీనిని శివుడి పూజలో శివలింగానికి పెట్టకపోవడమే మంచిదని అంటున్నారు.