ధోని అంటే అంతే.. సిక్స్ కొట్టి కన్నెత్తి కూడా చూడలేదు?

praveen
ప్రస్తుతం 2023 సీజన్ కు సంబంధించి ఐపిఎల్ హడావిడి మొదలైంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక అందరూ ఆటగాళ్లు కూడా ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ  ఉన్నారు. మరి కొంతమంది అంతర్జాతీయ క్రికెట్లో బిజీగా ఉన్నారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కు రిటర్మెంట్ ప్రకటించి కేవలం ఐపిఎల్ లో మాత్రమే ఆడుతున్న మహేంద్ర సింగ్ ధోని.. అందరికంటే ముందే ఇక మైదానంలోకి దిగి నెట్స్ లో తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు గత కొంతకాలం నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే.

 అయితే చెన్నై సూపర్ కింగ్స్ జట్టును తన సారాధ్యంలో ఇప్పటికే నాలుగు సార్లు టైటిల్ విజేతగా నిలిపాడు అన్న విషయం తెలిసిందే. అయితే ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని భావిస్తున్న తరుణంలో ఇక సిఎస్కే ఈ ఏడాది ధోని కెప్టెన్సీలో టైటిల్ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అభిమానుల కోరిక తీర్చేందుకే ఇప్పుడు ధోని కూడా సిద్ధంగా ఉన్నాడు అన్నది  ప్రాక్టీస్ లో చెమటోడుస్తున్న తీరు చూస్తే అర్థమవుతూ ఉంది. ఇక ఇలా నెట్ సెషన్ లో ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో సిక్సర్లు ఫోర్ల వర్షం కురిపిస్తూ ఉన్నాడు మహేంద్ర సింగ్ ధోని.

 అయితే గత మూడు సీజన్ల నుంచి కూడా బ్యాట్స్మెన్ గా ధోని విఫలం అవుతూ ఉన్నాడు అని చెప్పాలి. గత ఏడాది ఐపీఎల్ లో ధోని బ్యాటింగ్లో పరవాలేదు అనిపించినప్పటికీ.. మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం లేకపోవడంతో ఇక సీఎస్కే జట్టు ఎంతో పేలవమైన ప్రదర్శన చేసింది అని చెప్పాలి. కాగా మార్చి 31వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ధోని తను కొట్టే షాట్ల విషయంలో ఎంత కాన్ఫిడెంట్ తో ఉంటాడు అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ ఒక వీడియో వైరల్ గా మారిపోయింది. నెట్ ప్రాక్టీస్ సమయంలో ధోని ఒక భారీ సిక్సర్ కొట్టి కనీసం ఆ బంతి సిక్స్ వెళ్లిందా లేదా అన్న విషయం కూడా కన్నెత్తి చూడలేదు.. దీనిబట్టి.. అతని కాన్ఫిడెంట్ ఏ రేంజ్ లో ఉంటుంది అని అర్థం చేసుకోవచ్చు అని చెప్పాలి. ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: