23 ఫోర్లు, 5 సిక్సర్లతో.. విధ్వంసం సృష్టించిన గంభీర్, ఊతప్ప?

praveen
గౌతమ్ గంభీర్, రాబిన్ ఉతప్ప.. వీరిద్దరూ భారత క్రికెట్లో ఎంత గొప్ప ఆటగాళ్లు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకసారి మైదానంలో బ్యాట్ పట్టుకొని బరిలోకి దిగారు అంటే చాలు ప్రత్యర్ధికి ముచ్చెమటలు పట్టిస్తూ ఉంటారు. బంతి ఎక్కడ వేసిన బౌండరీ బాదుతూ అదరగొడుతూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఈ భారత జట్టు తరఫున ఎన్నోసార్లు అద్వితీయమైన ఇన్నింగ్స్ ఆడి మంచి విజయాలు అందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇద్దరు ఆటగాళ్లు ఇక ఇప్పుడు క్రికెట్కు వీడ్కోలు పలికినప్పటికీ.. ఏదో ఒక విధంగా ఆటకు దగ్గరగానే ఉంటున్నారు అని చెప్పాలి.

 అయితే ఇక అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ.. ఈ ఇద్దరు క్రికెటర్లలో ఇంకా సత్తా ఏమాత్రం తగ్గలేదు అన్న విషయం మాత్రం ఇక ఇటీవలే మరోసారి నిరూపితం అయింది అని చెప్పాలి. ఎందుకంటే లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో భాగంగా ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మరో మాజీ ప్లేయర్ రాబిన్ ఉత్తప్ప సైతం తమ బ్యాటింగ్ తో విధ్వంసమే సృష్టించారు అని చెప్పాలి.. ఒకరకంగా ప్రత్యర్థి బౌలర్లపై వీరవిహారం చేసి చెడుగుడు ఆడేశారు.. 23 ఫోర్లు ఐదు సిక్సర్లతో ఇక జోడి చెలరేగిపోయింది అని చెప్పాలి. వీరి బ్యాటింగ్ చూసి ప్రస్తుతం అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు..

 ప్రస్తుతం దోహా వేదికగా లెజెండ్స్ క్రికెట్ లీగ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మహారాజాస్ జట్టు ప్రత్యర్థికి గట్టి పోటీ ఇస్తూ వరుస విజయాలు సాధిస్తుంది. ఇకపోతే ఇటీవల జరిగిన మ్యాచ్లో ఆసియా లయన్స్ జట్టు 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. ఇక ఆ తర్వాత ఇండియా మహారాజాస్ జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే 12.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించింది అని చెప్పాలి. ఇక రాబిన్ ఉతప్ప,  గౌతమ్ గంభీర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. ఊతప్ప 39 బంతుల్లో11 ఫోర్లు ఐదు సిక్సర్లతో 88 పరుగులు.. గౌతమ్ గంభీర్ 36 బంతుల్లో 12 ఫోర్ ల సహాయంతో 61 పరుగులు చేసి ఎంతో అలవోకగా ఇక భారత జట్టును గెలిపించారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: