పసికూన చేతిలో.. క్లీన్ స్వీప్ అయిన విశ్వవిజేత?

praveen
ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లాండ్ ప్రదర్శన గురించి చర్చించుకుంటున్నారు. వరల్డ్ కప్ ఛాంపియన్ ఏంటి ఇలాంటి ప్రదర్శన చేసింది.. అది కూడా ఏకంగా పసికోన బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోవడం ఏంటి.. ఓడిపోతే ఓడిపోయింది కానీ వరుసగా మూడు మ్యాచ్లలో ఓడిపోయి అటు క్లీన్ స్వీప్ కావడం ఏంటి అనే ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్ కావడానికి అటు ఇంగ్లాండ్ అభిమానులు అయితే అసలు జీర్ణించుకోలేకపోతున్నారు అని చెప్పాలి. దీంతో ప్రపంచం క్రికెట్లో దీనికి సంబంధించిన చర్చే ప్రస్తుతం జరుగుతూ వస్తుంది.

 ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ లో ఇంగ్లాండ్ టీం ఛాంపియన్ జట్టుగా కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. ఇక పటిష్టమైన జట్టుగా కూడా ఇంగ్లాండ్కు పేరు ఉంది. అలాంటి ఇంగ్లాండ్ జట్టు ఇట్లా బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్ళింది. ఈ క్రమంలోనే సత్తా చాటి వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది అని చెప్పాలి. కానీ టీ20 సిరీస్ లో మాత్రం పూర్తిగా చేతులెత్తేసింది ఇంగ్లాండ్. సొంత గడ్డపై వన్డే సిరీస్ కోల్పోవడంతో ఇక ఆ కసి మొత్తం టి20 సిరీస్ లో చూపించింది బంగ్లాదేశ్. ఇక వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది. అయితే చివరి టీ20 మ్యాచ్ లో అయినా ఇంగ్లాండ్ విజయం సాధించి పరువు నిలబెట్టుకుంటుందని అందరూ అనుకున్నారు.

 కానీ చివరి టీ20 మ్యాచ్ లో కూడా ఇంగ్లాండ్ పై 16 పరుగులు తేడాతో విజయం సాధించిన బంగ్లాదేశ్ జట్టు ఏకంగా క్లీన్ స్వీప్ చేసింది అని చెప్పాలి. టి20 ఛాంపియన్గా పేరు ఉన్న ఇంగ్లాండ్ జట్టును వైట్ వాష్ చేసేసింది పసికూన బంగ్లాదేశ్. లిటన్ దాస్ 73, శాంటో 47పరుగులతో రాణించగా.. తస్కిన్ అహ్మద్ రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు అని చెప్పాలి. కాగా ఇంగ్లాండ్ లాంటి పటిష్టమైన జట్టు బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్ కావడాన్ని ఇప్పటికి క్రికెట్ ప్రేక్షకులు నమ్మలేకపోతున్నారు అని చెప్పాలి. ఈ విషయం తెలిసి క్రికెట్లో ఏది అసాధ్యం కాదు అని నిపుణులు చెప్పే మాట నిజమనేమో అని అనుకుంటూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: