వన్డే సిరీస్ కి ముందు.. ఆస్ట్రేలియాకు ఊహించని షాక్?

praveen
గత కొన్ని రోజుల నుంచి ఆస్ట్రేలియా జట్టుకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. జట్టులో ఉన్న స్టార్ ప్లేయర్లు వరుసగా గాయం బారిన పడుతూ ఇక జట్టుకు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇటీవల ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చిన సమయంలో కూడా ఆస్ట్రేలియాకు ఇలాంటి కష్టాలు తప్పలేదు అని చెప్పాలి. ఎంతోమంది స్టార్ ప్లేయర్లు గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యారు. ఇకపోతే భారత పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ ముగించుకుంది ఆస్ట్రేలియా జట్టు.

 ఇక మరికొన్ని రోజుల్లో అటు ఆతిధ్య భారత జట్టుతో వన్డే సిరీస్ లో తలబడబోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే టెస్ట్ సిరీస్ విజయం సాధించిన టీమిండియా జట్టు.. ఇక వన్డే సిరీస్ గెలుచుకోవడంపై కూడా కన్నేసింది అని చెప్పాలి. ఇలాంటి సమయంలో ఆస్ట్రేలియాకు మరో షాక్ తగిలింది. అటు టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండు టెస్ట్ మ్యాచ్లు ముగిసిన తర్వాత వ్యక్తిగత కారణాలతో స్వదేశానికి పయనం అయ్యాడు కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్. ఇక తర్వాత రెండు టెస్టులకు అతను అందుబాటులోకి రాలేదు అని చెప్పాలి.

 ఇకపోతే ఇక ఇప్పుడు వన్డే సిరీస్ ప్రారంభానికి ముందు కూడా అటు ఆస్ట్రేలియాకు మరో బాడ్ న్యూస్ అందింది. టెస్ట్ సిరీస్ నుంచి అర్ధాంతరంగా తప్పుకొని అటు స్వదేశానికి పయనమైన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ నెల 17 నుంచి ప్రారంభం కాబోయే వన్డే సిరీస్ కు కూడా దూరం కానున్నాడు అన్నది తెలుస్తుంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఫ్యాట్ కమిన్స్ తల్లి ఇటీవలే ప్రాణాలు కోల్పోయింది. ఈ క్రమంలోనే స్వదేశం వెళ్లిన కమిన్స్ టెస్ట్ సిరీస్ కు దూరంగా ఉన్నాడు. ఇక ఇప్పుడు వన్డే సిరీస్ కి కూడా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడట. దీంతో ఇక చివరి రెండు టెస్టుల నుంచి జట్టును ముందుకు నడిపిస్తున్న స్మిత్ ఇక వన్డే సిరీస్ లో కూడా కెప్టెన్సీ బాధ్యతలు భుజాన వేసుకోబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: