మహిళల ప్రీమియర్ లీగ్ లో ఆర్సీబి కథ ముగిసినట్టేనా... ?

VAMSI
గత రాత్రి ముగిసిన మహిళల ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లో ఢిల్లీ తో బెంగుళూరు జట్టు మళ్ళీ ఓటమి పాలయింది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో బరిలోకి దిగిన స్మృతి మందన్న సేన టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్ లలో కేవలం 150 పరుగులకే పరిమితం అయింది. బెంగుళూరు కెప్టెన్ స్మృతి మందన్న మరోసారి బ్యాటింగ్ లో ఘోరంగా ఫెయిల్ అయ్యి టీం ఓటమిలో ప్రధాన కారణమయింది. బెంగుళూరు టీం లో స్మృతి మందన్న, సోపీ డివైన్ , ఎలీషా పెర్రీ , హెదర్ నైట్ , రిచా ఘోష్, రేణుక సింగ్ లాంటి అంతర్జాతీయ ప్లేయర్స్ ఉన్నారు. అదే విధంగా శ్రేయాంక్ పటేల్ , ప్రీతీ బోస్ లాంటి దేశవాళీ ప్లేయర్స్ ఉన్నారు.
వాస్తవంగా చెప్పాలంటే ఇంతకన్నా మంచి టీం దొరకడం ఏ ఫ్రాంచైజీ కన్నా కష్టమే అని చెప్పాలి. కానీ ఎందుకనో ఈ లీగ్ లో ఒక టీం గా ఆడి ఇప్పటి వరకు 5 మ్యాచ్ లు ఆడగా కనీసం ఒక మ్యాచ్ లోనూ విజయం సాధించలేక చతికిలపడ్డారు. రాత్రి జరిగిన మ్యాచ్ లో బెంగుళూరు ఢిల్లీ పై 6 వికెట్ల తేడాతో పరాజయం చెందింది. ఈ మ్యాచ్ లో కూడా బెంగుళూరు తక్కువ స్కోర్ కే పరిమితం అయ్యేది. కానీ పెర్రీ మరియు రిచా ఘోష్ లు ఆఖర్లో చెలరేగడంతో 150 పరుగులు చేసింది. ఈ స్కోర్ ను డిపెండ్ చేయలేక స్మృతి మందన్న సేన చేతులెత్తేసింది. ఈ ఓటమితో టాప్ 3 లో చోటు దక్కించుకునే అవకాశాన్ని దాదాపుగా కోల్పోయిందనే చెప్పాలి.
ఈ టోర్నీలో ఒక్కో టీం మొత్తం 8 లీగ్ మ్యాచ్ లు ఆడనుండగా , బెంగుళూరు కు ఇక మూడు మ్యాచ్ లు మాత్రమే మిగిలాయి. మిగిలిన అన్ని మ్యాచ్ లు గెలిచినా టాప్ 3 కి చేరడం కష్టం అవుతుంది. టాప్ 3 కి చేరితేనే టైటిల్ కోసం పోరాడే అవకాశం అయినా ఉంటుంది. లేదా పురుషుల ఐపీఎల్ లగే టైటిల్ కోసం సంవత్సరాలు సంవత్సరాలు వెయిట్ చేస్తూనే ఉండాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: