ఇక నేను బౌలింగ్ చేయడం ఆపాలేమో : అశ్విన్

praveen
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లో భాగంగా ఇండియా మరియు ఆస్ట్రేలియా ల మధ్య జరిగిన నాలుగు టెస్టులలో రెండు టెస్టులను గెలిచి టీమిండియా ఒక టెస్ట్ లో ఓడిపోయింది. మిగిలిన చివరి టెస్ట్ డ్రాగా ముగియడం తో ఈ ట్రోఫీ ని టీమ్ ఇండియా దక్కించుకుంది.. నాలుగో టెస్ట్ అహ్మదాబాద్ స్టేడియం లో ఆడగా ఈ టెస్ట్ డ్రాగా ముగియడం విశేషం. దాంతో 2-1 తేడాతో టీమ్ ఇండియా మరోసారి ఈ ట్రోఫీని చేజిక్కించుకుంది. ఈ ట్రోఫీ టీమిండియా గెలవడం ఇది నాలుగోసారి కావడం విశేషం. వాస్తవానికి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ కి ఒక్క మ్యాచ్ గెలిచినా కూడా నేరుగా ఫైనల్ కి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ అలా జరగలేదు. ఆ తర్వాత జరిగిన రెండు టెస్ట్ లలో ఒకటి ఓడిపోయి రెండోది డ్రా కావడం తో ఇండియా ఫైనల్ బెర్త్ కి చేరుకుంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మరోవైపు న్యూజిలాండ్ - శ్రీలంక మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో శ్రీలంక ఓడిపోవడంతో టీమిండియా కి ఫైనల్ కి చేరుకోవడం సాధ్యం అయ్యింది.
ఇక నాలుగో టెస్ట్ జరిగిన సందర్భంలో ఒక సరదా సంఘటన జరిగింది. మ్యాచ్ ఎలాగూ డ్రా అవుతుందని కెప్టెన్ రోహిత్ శర్మ గట్టిగా నమ్మడంతో కొన్ని బౌలింగ్ ప్రయోగాలు చేయడం విశేషం. ఇప్పటికే బ్యాటింగ్ చేస్తున్న వారితో బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చాడు. దాంట్లో భాగంగా శుబ్ మన్ గిల్ ఒక ఓవర్, పూజార మరొక ఓవర్ బౌలింగ్ చేయడం చేశారు, అయితే పూజార ఓవర్ మొత్తం బౌలింగ్ చేసి ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు. దాంతో  స్పెషలిస్ట్ స్పిన్నర్ గా ముద్ర పడిన అశ్విన్ సరదాగా స్పందించాడు. 'ఇప్పుడు నేనేం చేయాలి బౌలింగ్ జాబ్ వదిలేయాలి ఏమో' అంటూ కామెంట్ చేయడం విశేషం. ప్రస్తుతం అశ్విన్ కామెంట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: