షమీని చూస్తూ.. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేసిన ఇండియన్ ఫ్యాన్స్?

praveen
భారత్ ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా 4 వ టెస్ట్ మ్యాచ్ జరిగిన విషయం తెల్సిందే. అయితే ఈ నాలుగో టెస్టులో తొలి రోజు ఒక వివాదాస్పద ఘటన జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రాగా చివరి మ్యాచ్ మొదటి రోజు ముగిసిన తర్వాత భారత బౌలర్ మహమ్మద్ షమీని చూసిన కొంతమంది ఇండియన్స్ ఫ్యాన్స్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించిన వీడియోను పలువురు షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. జైశ్రీరామ్ అంటూ నినాదాలు చేసిన సదరు వ్యక్తులపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.
మొదటిరోజు ఆట ముగిసిన తర్వాత డగోట్ లో టీమ్ అంతా కూడా ఉన్నారు. ఆ టైంలోనే స్టాండ్స్ లో ఉన్న కొంతమంది ఫ్యాన్స్ ఇలా నినాదాలు చేయడం విశేషం. మొదట ఇండియన్ ప్లేయర్స్ సూర్య కుమార్ ను చూసి అందరూ సూర్య సూర్య అరిచారు. ఆ తర్వాత అక్కడే ఉన్న షమీ వారికి కనిపించగా ఉన్నట్టుండి ఇలా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. షమీ వీటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇక అందులో ఉన్న వ్యక్తి అయితే షమీ ని పేరు పెట్టి పిలిచి మరి జై శ్రీరామ్ అని అరవడం విశేషం.
ఈ వీడియో చూసిన కొంత మంది నెటిజన్స్ అది క్రికెట్ మ్యాచా లేకపోతే రథయాత్రనా అంటూ ప్రశ్నించడం కొస మెరుపు. చివరి టెస్ట్ అహ్మదాబాద్ స్టేడియంలో జరగక ఈ ఆట కోసం 80 శాతం టికెట్స్ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కొంతమంది కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. వారే మిగతా వారిని కూడా తీసుకొచ్చారని అందుకే అలా అరిచారు అంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సంఘటనపై కెప్టెన్ రోహిత్ శర్మ మీడియా సమావేశం లో స్పందించాడు. అసలు ఇలాంటి ఒక విషయం తనకు తెలియదంటూ చెప్పుకొచ్చాడు. జై శ్రీరామ అంటూ ఫ్యాన్స్ అరవడం పట్ల తనకు అవగాహన లేదని, ఇప్పుడే ఇది తెలిసింది అని, అక్కడ జరిగిన విషయం ఏంటో తనకు తెలియదు అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా  ఇండియా నాలుగు టెస్టులు ఆడగా చివరి టెస్ట్ డ్రాగా ముగిసింది. దాంతో 2 -1 తో భారత్ సిరీస్ కైవసం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: