అహ్మదాబాద్ పిచ్ పై.. ఆకాష్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
ఆస్ట్రేలియా భారత్ మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా టెస్ట్ సిరీస్ ప్రారంభం కావడానికి  ముందు నుంచే ఒక విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. భారత్లో ఉన్న పిచ్ ల గురించి ఎంతోమంది ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు మాట్లాడుతూ.. షాకింగ్ కామెంట్స్ చేయడం ఎప్పుడు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్ల వ్యాఖ్యలకు అటు భారత మాజీలు కూడా కౌంటర్ ఇచ్చారు. అయితే ఇలా పిచ్ ల గురించిన చర్చ ఇక ఇప్పుడు నాలుగో మ్యాచ్ వరకు కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది అని చెప్పాలి.

 సాదరణంగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఎక్కువగా ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శన గురించే మాజీ ఆటగాళ్లు రివ్యూలు ఇవ్వడం  చూస్తూ ఉంటాం. కానీ ఎందుకో మొదటిసారి ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లలో ఆటగాళ్ల ప్రదర్శన కంటే పిచ్ గురించి అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక అహ్మదాబాద్ వేదికగా ప్రస్తుతం నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉండగా.. మొన్నటి వరకు జరిగిన మూడు మ్యాచ్ ల పిచ్ లతో పోల్చి చూస్తే ఈ పిచ్ కాస్త భిన్నంగా ఉంది. మూడు మ్యాచ్లలో పరుగులు చేయడానికి తడబడిన ఆటగాళ్లు అటు నాలుగో మ్యాచ్లో మాత్రం చెలరేగిపోతున్నారు.

 ఏకంగా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లోని 480 పరుగుల భారీ స్కోరు చేసింది అని చెప్పాలి. అయితే ఇలా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన అన్ని మ్యాచ్లలో కూడా క్యూరేటర్లు భిన్నమైన పిచ్లను సిద్ధం చేయడంపై భారతమాజీ బ్యాట్స్మెన్ ఆకాష్ చోప్రా స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బౌలర్లకు అనుకూలంగా పిచ్లు తయారు చేస్తున్నారు అంటూ విమర్శలు రావడంతో.. వాటిని తిప్పి కొట్టడానికి చివరి టెస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ పిచ్ ను సిద్ధం చేయడం సరికాదు అంటూ వ్యాఖ్యానించాడు ఆకాష్ చోప్రా. కాగా ప్రస్తుతం ఆస్ట్రేలియా తమ ముందు ఉంచిన 480 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు పోరాడుతుంది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: