గిల్ ఆ రికార్డును.. ఈజీగా సాధిస్తాడు : గవాస్కర్

praveen
ప్రస్తుతం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే భారత జట్టుకు ఇది డు ఆర్ డై మ్యాచ్ కావడం గమనార్హం. ఎందుకంటే సిరీస్ లో విజయం సాధించాలంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగు పెట్టాలి అంటే భారత జట్టు నాలుగవ టెస్ట్ మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి. అయితే అదే సమయంలో అటు ఆస్ట్రేలియా నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది అని చెప్పాలి.

 ఇక చివరి టెస్ట్ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ లోనే 480 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇక ఈ భారీ టార్గెట్ చేదించేందుకు ప్రస్తుతం భారత జట్టు బరిలోకి దిగింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే టీమిండియా కు శుభారంభం అందుతుందా లేదా అని అనుకుంటున్న సమయంలో ఒకవైపు రోహిత్ శర్మ తక్కువ పరుగులకే వికెట్ కోల్పోయాడు. దీంతో అందరూ నిరాశలో మునిగిపోయారు. ఇలాంటి సమయంలో మరో ఓపెనర్ గిల్ మాత్రం సెంచరీ తో చెలరేగి పోయాడు. ఏకంగా 128 పరుగులు చేసి అదరగొట్టాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతనిపై ఎంతోమంది మాజీ ఆటగాళ్లు  ప్రశంసలు కురిపిస్తున్నారు.

 ఈ క్రమంలోనే యువ ఆటగాడు శుభమన్ గిల్ ప్రదర్శన గురించి ఇటీవల భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు. అతడు కాన్ఫిడెంట్ తో బ్యాటింగ్ చేయడం ఎంతగానో ఆకట్టుకుంటుంది అంటూ చెప్పకువచ్చాడు. అతను ఇలాగే ఆడితే టెస్టు క్రికెట్లో పదివేల పరుగుల మార్కును అందుకోవడం ఎంతో సులభం అంటూ తెలిపాడు. స్టార్క్ బౌలింగ్లో గిల్ అద్భుతంగా ఆడుతున్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. ముఖ్యంగా బౌలర్ల లైన్ అండ్ లెంత్ పసిగట్టడం   గొప్ప విషయం అంటూ ప్రశంసలు గుర్తించాడు సునీల్ గవాస్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: