ఆ ఫార్మాట్ కి.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్?

praveen
సాధారణంగా ఆటగాళ్ల వయసు పెరుగుతున్న కొద్ది క్రికెట్ లో ఉన్న మూడు ఫార్మట్లలో కూడా రాణించడం చాలా కష్టతరం అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమ ఫిట్నెస్ ఏ ఫార్మాట్ కి సరిగ్గా సరిపోతుంది అనే విషయాన్ని గమనించి ఇక మిగతా ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించి ఏదో ఒక ఫార్మాట్లో కొనసాగడం లాంటివి చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో ఎంతోమంది స్టార్ క్రికెటర్లు. అయితే ఇలా ఈ మధ్యకాలంలో ఇది ఒక ట్రెండ్ గా మారిపోయింది అని చెప్పాలి. అయితే పూర్తిగా ఫిట్ గా ఉన్న ఆటగాళ్లు సైతం ఒత్తిడిని తట్టుకోలేక కొన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాము.

 ఇక ఇటీవలే మరో స్టార్ క్రికెటర్ కూడా ఇలాగే రిటైర్మెంట్ ప్రకటించి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ షాన్ మార్ష్ ఫస్ట్ క్లాస్, అంతర్జాతీయ వన్డేల నుంచి కూడా రిటైర్మెంట్ తీసుకుంటున్నాను అంటూ ప్రకటించాడు. ఇకపైన కేవలం టి20 క్రికెట్లో మాత్రమే కొనసాగుతాను అంటూ స్పష్టం చేశాడు. కాగా 39 ఏళ్ల షాన్ మార్ష్ 2001లో వెస్ట్రన్ ఆస్ట్రేలియా తరఫున ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడాడు అని చెప్పాలి. లిఫ్ట్ ఏ క్రికెట్లో 177 మ్యాచ్ లలో 44.45 సగటుతో 7158 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్ క్లాస్ కెరీర్ లో వెస్ట్రన్ ఆస్ట్రేలియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించాడు.

 ఇక అంతర్జాతీయ కెరియర్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా తరపున 38 టెస్ట్ మ్యాచ్లు 73 వన్డే మ్యాచ్లు ఆడాడు షాన్ మార్ష్. 15 టీ20 మ్యాచ్ లులో ఆస్ట్రేలియా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు  అని చెప్పాలి. 2019లోనే టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పేసాడు షాన్ మార్ష్. అతని టెస్ట్ కెరియర్ లో ఆరు సెంచరీలు.. 10 అర్థ శతకాలు ఉన్నాయి. ఇక వన్డేల్లో 2073 పరుగులు.. టీ20 లలో 255 పరుగులు మాత్రమే చేశాడు. కాగా షాన్ మార్ష్  సోదరుడు మిచెల్ మార్ష్  ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: