IND vs AUS: రికార్డులతో చరిత్ర తిరగరాసిన అశ్విన్?

Purushottham Vinay
ఇక అహ్మదాబాద్‌ వేదికగా టీమిండియాతో జరగుతున్న నాలుగో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా దుమ్మురేపింది. అయితే తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ 480 పరుగులకు ఆలౌటైంది.ఆసీస్‌ బ్యాటర్లలో ఓపెనర్‌ ఉస్మాన్‌ ఖవాజా(180) ఇంకా కామెరాన్ గ్రీన్(114) అద్భుతమైన సెంచరీలతో చెలరేగారు. అలాగే వారితో పాటు టెయిలాండర్‌ టాడ్‌ మర్ఫీ(41) పరుగులతో బాగా ఆకట్టుకున్నాడు.ఇక భారత బౌలర్లలో వెటరన్‌ స్పిన్నర్‌ అయిన రవిచంద్రన్‌ అశ్విన్‌ మరో సారి తన మాయాజాలాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మొత్తం 6 వికెట్లతో అశ్విన్‌ సత్తాచాటాడు.ఇంకా అతడిపాటు షమీ రెండు వికెట్లు, అక్షర్‌ ఇంకా అలాగే జడేజా తలా వికెట్‌ సాధించారు.ఇక 6 వికెట్లతో చెలరేగిన అశ్విన్‌ పలు అరుదైన రికార్డులను తన పేరిట రాసుకున్నాడు. స్వదేశంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక ఐదు వికెట్ల హాల్స్‌ సాధించిన బౌలర్‌గా  నిలిచాడు.


ఇప్పటిదాకా ఈ రికార్డు భారత దిగ్గజ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే పేరిట ఉండేది.టీం ఇండియా గడ్డపై టెస్టుల్లో కుంబ్లే 25 సార్లు ఐదు వికెట్లు ఘనత సాధించాడు. ఇక తాజా మ్యాచ్‌లో అయితే 26వ సారి ఐదు వికెట్‌ హాల్‌ నమోదు చేసిన అశ్విన్‌.. అనిల్ కుంబ్లేను అధిగమించాడు. కాగా అశ్విన్‌ దారిదాపుల్లో కూడా ఏ ఇండియన్ బౌలర్‌ లేడు. ఇక ఓవరాల్‌గా  ఇది అశ్విన్‌కు 32వ ఐదు వికెట్ల ఘనత కావడం విశేషం. ఇంకా అదే విధంగా మరో అరుదైన రికార్డును కూడా అశ్విన్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.టెస్టు క్రికెట్‌లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా అశ్విన్‌(113) రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో అనిల్‌ కుంబ్లే(111) రికార్డును అశ్విన్‌ ఈజీగా బ్రేక్‌ చేశాడు. వీరిద్దరూ తప్ప మరే భారత బౌలర్ ఈ జట్టుపై 100 వికెట్లకు మించి తీయలేదు. ఇంకా మరోవైపు బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆసీస్‌ స్పిన్నర్‌ నాథన్‌ లియాన్‌(113) రికార్డును రవి చంద్రన్ అశ్విన్‌ సమం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: