సీఎస్కే జట్టు సక్సెస్ కి.. అసలు కారణం అదే : రాబిన్ ఉతప్ప

praveen
ప్రస్తుతం ఐపీఎల్ ఫీవర్ ప్రారంభమైంది. మార్చి 31వ తేదీ నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే అన్ని స్పోర్ట్స్ ఛానల్ళు కూడా ప్రస్తుతం ఐపీఎల్ పై రివ్యూలు తీసుకోవడంలో బిజీబిజీగా ఉన్నాయి. ఎంతోమంది లెజెండరీ క్రికెటర్లను పిలిచి ఇక టాక్ షోలు నిర్వహించి ఆసక్తికర ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాయి అని చెప్పాలి.  ఈ క్రమంలోనే ఇక ఇలా ఐపిఎల్ కు సంబంధించి ఎంతో మంది మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకోవడం కూడా చూస్తూ ఉన్నారూ.

 ఈ క్రమంలోనే ఈసారి కప్పు ఎవరు కొడతారు అనే విషయం చర్చకు వచ్చినప్పుడల్లా అటు మహేంద్రసింగ్ ధోని సారధ్యంలో బరిలోకి దిగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ పేరు కూడా ప్రస్తావనకు వస్తుంది అని చెప్పాలి. ఇప్పటివరకు నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ అందుకని మోస్ట్ సక్సెస్ఫుల్ జట్టుగా కొనసాగుతుంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే చెన్నై జట్టు ఇక ఒక కుటుంబంలా ఉంటుందని ఇదే జట్టు సక్సెస్ కు కారణమని ఇప్పటికే ఆ టీం తరపున ఆడిన ఆటగాళ్లందరూ కూడా చెప్పుకొచ్చారు. అయితే ఇక చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కొన్ని ఏళ్లపాటు ఆడిన రాబిన్ ఉత్తప్ప సైతం ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 2021 ఐపిఎల్ సీజన్లో నేను సీఎస్కే జట్టు తరఫున తొలి 12 మ్యాచ్లు ఆడలేదు. అయినప్పటికీ జట్టులో వాతావరణం ఆరోగ్యం గానే ఉంది. ఎందుకంటే ఎనర్జీ కేవలం తుది 11 మందిలో మాత్రమే కాదు మొత్తం 14 మందిలో ఉండాలని కోరుకుంటుంది సీఎస్కే జట్టు. సహాయ సిబ్బంది ప్రతి ఒక్కరితో మాట్లాడే తీరు కూడా సీఎస్కే లో అద్భుతంగా ఉంటుంది. ప్రతి వారానికి ఒకసారి ఇక అందరితో చర్చించడం చేస్తూ ఉంటారు. ఈ వారంలో ఆటగాళ్లు ఏం నేర్చుకున్నారు.. ఇక తుది జట్టు  ఎలా ఉంటే బాగుంటుంది.. ఏం చేస్తే జట్టుకు ప్రయోజనం చేకూరుతుంది అనే విషయాలను ప్రతి ఆటగాడితో చర్చిస్తారు. ఒక్కోసారి ఆడేందుకు అవకాశం రాకపోయినా ఇక ఆటగాడితో చర్చలు జరుపుతారు. దీంతో ప్రతి ఒక్క ఆటగాడికి తాము జట్టులో భాగమయ్యాము అన్న  భావన కలుగుతుంది.. అభద్రతాభావం పోయి బాగా ఆడేందుకు ఛాన్స్ ఉంటుంది. ఇదే చెన్నై జట్టు విజయానికి కారణం అంటూ చెప్పుకొచ్చాడు రాబిన్ ఉతప్ప.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: