అశ్విన్ అగ్రస్థానం వారం మురుపమేనా.. ఎందుకంటే?

praveen
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ ని అప్డేట్ చేస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం లోనే ఇక ఒక వారం కాలం లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లు ఇక తమ ర్యాంకులు మెరుగు పరుచుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈ క్రమం లోనే  ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రవిచంద్రన్ అశ్విన్  ఏకంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక అశ్విన్ ఐసిసి టెస్ట్ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడంతో అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోయారు. అతనికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు కూడా తెలిపారు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవలే మరోసారి ఫ్రెష్ గా టెస్ట్ ర్యాంకింగ్స్ ని ప్రకటించింది ఐసిసి. అయితే ఈసారి మాత్రం అశ్విన్ కి షాక్ తగిలింది అని చెప్పాలి. ఎందుకంటే అగ్రస్థానం కేవలం మూన్నాళ్ళ మురిపంగానే మారిపోయింది. అయితే ప్రస్తుతం ప్రకటించిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో అశ్విన్ అగ్రస్థానంలోనే కొనసాగుతున్నప్పటికీ ఇక అశ్విన్ తో పాటు నెంబర్ వన్ స్థానాన్ని మరో ఆటగాడితో పంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

 అశ్విన్ తో పాటు ఇంగ్లాండ్  బౌలర్ జేమ్స్ అండర్సన్ కూడా ప్రస్తుతం సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాడు. దీంతో మొన్నటి వరకు నెంబర్ వన్ స్థానంలో ఒకే ఒక్కడిగా ఉన్న అశ్విన్.. ఇక ఇప్పుడు తన స్థానాన్ని మరొకరితో పెంచుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పాలి. అయితే ఇక అశ్విన్ అండర్సన్ ఇద్దరు కూడా ప్రస్తుతం 589 ర్యాంకింగ్స్ పాయింట్లతో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు అని చెప్పాలి. కాగా గత కొంతకాలం నుంచి బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అశ్విన్, అండర్సన్, ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్  మధ్య పోటీ కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: