WPL : ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. ఎన్ని బంతుల్లో తెలుసా?

praveen
భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇటీవల ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత క్రికెటర్లతో పాటు అటు విదేశీ క్రికెటర్లు కూడా ఒక జట్టుగా మారి ప్రస్తుతం హోరా హోరీగా పోరాడుతున్నారు. ఐదు జట్లతో ప్రారంభమైన ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ ప్రేక్షకులకు అసలైన ఇంటర్నెట్ పంచుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ప్రతి మ్యాచ్ లో కూడా పరుగుల వరద పారుతూ ఉంది అని చెప్పాలి.

 పవర్ హిట్టర్లు ప్రస్తుతం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో చెలరేగిపోతున్న నేపథ్యంలో ఎంతో అలవోకగా ప్రతి మ్యాచ్ లో కూడా ఒక జట్టు 200 పైగా పరుగులు చేస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం అని చెప్పాలి. అంతేకాదు ఇక విధ్వంసకర  బ్యాటింగ్ తో ఎన్నో రికార్డులను కూడా సృష్టిస్తూ ఉన్నారు మహిళా క్రికెటర్లు. ఇకపోతే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో అందరూ అనుకున్నట్లుగానే విజయం సాధిస్తే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు హ్యాట్రిక్ ఓటమిని నమోదు చేసి అభిమానులను నిరాశపరిచింది.

 అయితే ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు తరఫున ఓపెనర్గా బరిలోకి దిగే సోఫియా డంక్లి విధ్వంసకర బ్యాటింగ్ తో చెలరేగిపోయింది. ఆకాశమే హద్దుగా చెలరేగి బెంగళూరు బౌలర్లకు చుక్కలు చూపించింది అని చెప్పాలి. 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తిచేసుకుంది. ఈ క్రమంలోనే అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఐదో ఇన్నింగ్స్ లో వరుసగా 4,6,6,4,4 కొట్టింది. అయితే మహిళల ఐపీఎల్ లో మొన్న హర్మన్ ప్రీత్ కౌర్ ఫాస్టెస్ట్ 50 చేయగా ఇప్పుడు ఆ రికార్డును సోఫియా బ్రేక్ చేసింది. హార్మన్ 22 బంతుల్లో ఫిఫ్టీ చేస్తే.. సోఫియా 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: