నాలుగో టెస్ట్ లో.. కేఎస్ భరత్ ఉంటాడా.. ద్రావిడ్ ఏమన్నాడంటే?

praveen
ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా కీలకమైన చివరి టెస్ట్ మ్యాచ్ కు వేలయ్యింది. ఇక మరికొన్ని నిమిషాల్లో ఈ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అన్నది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇరు జట్లకు కూడా ఈ మ్యాచ్ ఎంతో కీలకమే. ఇక భారత జట్టుకు అయితే ఆస్ట్రేలియా కంటే  కాస్త ఎక్కువ ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఆస్ట్రేలియా ఇప్పటికే మూడో మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో అడుగుపెట్టింది.

 ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా గెలిస్తే కేవలం సిరీస్ సమం అవుతుంది. కానీ భారత జట్టు మాత్రం నాలుగో టెస్ట్ మ్యాచ్లో విజయం సాధిస్తేనే ఇక డబ్ల్యూటీసి ఫైనల్లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది అని చెప్పాలి. అదే సమయంలో ఇక ప్రతిష్టాత్మకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ గెలుచుకునేందుకు తప్పనిసరిగా నాలుగో మ్యాచ్లో గెలవాల్సి ఉంది అని చెప్పాలి. ఇక అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఈ మ్యాచ్ ఆస్ట్రేలియా, భారత్ ప్రధానుల సమక్షంలోనే జరగబోతుంది. ఇక ఎవరికివారు పదునైన వ్యూహాలు రచించుకుని బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో తొలి 3 టెస్టుల్లో బ్యాటింగ్ లో విఫలమైన తెలుగు క్రికెటర్ కె ఎస్ భరత్  ను నాలుగో టెస్ట్ కు పక్కకు పెట్టు పెడుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

 ఇక అతని స్థానంలో వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన కిషన్ ను తీసుకుంటారు అంటూ కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయ్. ఈ నేపథ్యంలో భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. కేఎస్ భరత్ కి మద్దతుగా నిలిచాడు. భరత్ బ్యాటింగ్ ఫామ్ తో జట్టు మేనేజ్మెంట్ కు సంబంధం లేదు. అతను వికెట్ల వెనకాల అద్భుతంగా రానిస్తున్నాడంటూ ద్రావిడ్ కొనియాడాడు. అతడికి పరిస్థితులను అర్థం చేసుకని ఆడే సత్తా ఉంది. మూడో టెస్టులో అత్యుత్తమంగా రాణించకపోయినప్పటికీ తొలి ఇన్నింగ్స్  లో చేసిన 17 పరుగులు మాత్రం ఎంతో కీలకమైనవి.. ఢిల్లీ టెస్ట్ లో కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో 23 పరుగులు చేశాడు. అతడు అద్భుతంగా రాణించాలంటే అదృష్టం కూడా కలిసి రావాలి అంటూ రాహుల్ ద్రవిడ్  చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: