అహ్మదాబాద్ పిచ్ పై.. స్మిత్ ఆసక్తికర వ్యాఖ్యలు?

praveen
భారత్ ఆస్ట్రేలియా మధ్య 4 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ప్రారంభమైన నాటి నుంచి కూడా ఒక విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది. ఎప్పుడైనా ఏదైనా మ్యాచ్ జరిగిందంటే చాలు ఆటగాళ్ల ప్రదర్శన ఎలా ఉంటుంది అన్న విషయంపై గురించి అందరూ చర్చించుకుంటారు. కానీ ఆస్ట్రేలియా ఇండియా మధ్య జరుగుతున్న ప్రతి మ్యాచ్ సమయంలో కూడా ఆయా మ్యాచ్ కు ఆతిథ్యం వహించబోయే స్టేడియంలో పిచ్ పరిస్థితి ఏంటి అన్న విషయం పైన తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది.

 భారత జట్టు తమకు అనుకూలంగా పిచ్ లను తయారు చేసుకుంటుందంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లు ఆరోపణలు చేస్తూ ఉంటే.. ఇదే విషయంపై స్పందిస్తున్న భారత మాజీలు వారికి కౌంటర్ ఇస్తున్నారు అని చెప్పాలి. అయితే ఇక ఇలాంటి స్పిన్ పిచ్ ల కారణంగానే భారత జట్టు రెండు మ్యాచ్లలో విజయం సాధించగా మూడో మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియా ఘన విజయాన్ని అందుకుంది. సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇక అహ్మదాబాద్ వేదికగా జరగబోయే నాలుగో టెస్ట్ మ్యాచ్లో ఎవరు విజయం సాధిస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి.

 ఈ క్రమం లోనే అహ్మదాబాద్ పిచ్ పై కూడా ఎంతో మంది స్పందిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం పై ప్రస్తుతం ఆస్ట్రేలియాకు తాత్కాలిక కెప్టెన్ గా వ్యవహరిస్తున్న స్టీవ్ స్మిత్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అహ్మదాబాద్ పిచ్ ను స్టీవ్ స్మిత్ పరిశీలించాడు. అయితే గత మూడు టెస్టులతో పోల్చి వస్తే అహ్మదాబాద్ పిచ్ కాస్త భిన్నం గా ఉంది అంటూ తెలిపాడు. తొలి రోజు ఫ్లాట్గా ఉంటుందని మ్యాచ్ జరిగే కొద్ది పగుళ్లు ఏర్పడి స్పిన్ కు అనుకూలిస్తుంది అంటూ తెలిపాడు. అయితే తాము ఎలాంటి పిచ్ ఫై అయినా ఆడేందుకు సిద్ధంగా ఉన్నాం అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: